నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే సుందరానికి' సినిమా ఫస్ట్ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆశించిన విధంగా ఓపెనింగ్ డే నాడు వసూళ్ళు అందుకోలేకపోయింది.
శని ఆదివారాల్లో అదే విధంగా అదే స్థాయిలో ఉండటంతో.. 'అంటే సుందరానికి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో మొదటి వారాంతాన్ని ముగించిందని ట్రేడ్ వర్గాల నివేదికలు వెల్లడించాయి.
నాని సినిమాకి రెండో వారంలో అడుగుపెట్టిన 'మేజర్' మరియు 'విక్రమ్' చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనట్లు తెలుస్తోంది. హిట్ టాక్ తెచ్చుకున్న రెండు సినిమాలు వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ అందుకోవడంతో నాని చిత్రం పై కాస్త ప్రభావం పడినట్లు కనిపిస్తోంది.
'అంటే.. సుందరానికి' సినిమా థియేట్రికల్ హక్కులను వరల్డ్ వైడ్ గా రూ. 28 కోట్లకు విక్రయించారని సమాచారం. అయితే ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే.. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాలంటే రెండో వారం వరకూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంది.
కాకపోతే ఓవర్ సీస్ లో మాత్రం నాని సినిమా వసూళ్ళు మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ఈ సినిమా ఒక్క యూఎస్ఏలోనే ఇప్పటి వరకు $840K కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలో మిలియన్ మార్క్ క్లబ్ లో చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం 'అంటే సుందరానికి' సినిమా ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం - 4.35 కోట్లు
సీడెడ్ - 1.10 కోట్లు
యూఏ - 1.15 కోట్లు
గుంటూరు - 0.79 కోట్లు
ఈస్ట్ - 0.76 కోట్లు
వెస్ట్ - 0.66 కోట్లు
కృష్ణా - 0.74 కోట్లు
నెల్లూరు - 0.33 కోట్లు
AP/TS మొత్తం - 9.88 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 1.30 కోట్లు
ఓవర్ సీస్ - 3.90 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ - 15.08 కోట్లు
'అంటే సుందరానికి' చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ గా నటించింది. అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ రోల్ లో కనిపించింది.
నరేష్ - రోహిణి - అజుగల్ పెర్మ్యూల్ - నదియా - హర్ష వర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. 'అంటే సుందరానికి' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేశారు.