శ్రద్ధ పెట్టిన చెక్కిన నిలువెత్తు శిల్పంలా ఉంటుంది అనూ ఇమ్మాన్యుయల్. వరుసపెట్టి అగ్రహీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఒక ఆడపిల్లకు ఫుల్ ఇగో ఉంటే ఎలా ఉంటుందో చూపెట్టిందీ చిత్రం. ఇగో ఉన్న అమ్మాయి పాత్రలో జీవించిన అను.. ఈ సినిమాలో ఫుల్ మార్కులు కొట్టేసింది.
పెరిగింది అమెరికాలోనే అయినా.. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే అనుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు.
ప్రేమంటే.. రెండు మనసుల కలయికగా చెప్పిన ఆమె.. తన ఓటు లవ్ మ్యారేజీకేనని చెప్పింది. నిజమైన లవ్ వెతుక్కుంటూ వస్తుందని నమ్ముతున్నట్లుగా చెప్పారు. ఇంట్లో తండ్రంటే భయమని.. అందుకే తాను అల్లరి అమ్మాయిని కాదన్నారు. ట్యూషన్ ఉందని ఇంట్లో చెప్పి ఫ్రెండ్స్ తో బయటకు షికార్లకు వెళ్లిన విషయాలు మాత్రం గుర్తు ఉన్నాయని.. అమెరికాలో చదివినప్పుడు ఈవెంట్స్ లో పెద్దగా పాల్గొనలేదని చెప్పారు.
ఆరో తరగతి చదివేటప్పుడుఇండియాకు తిరిగి వచ్చేశామని.. తనకు చిన్నతనం నుంచి సినిమాల్లోయాక్ట్ చేయాలన్న ఇష్టం ఉండేదన్నారు. తన తండ్రి రెండు మలయాళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారని.. తన తల్లి ఓ ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ గా పని చేస్తుంటారన్నారు.
అన్నయ్య బిజినెస్ మేనేజ్ మెంట్ చదువుతున్నాడని.. తన కెరీర్ ను ఎంపిక చేసుకునే విషయంలో తన తండ్రి ఒత్తిడి చేయలేదని చెప్పింది. సినిమాల్లోకి రావాలని తాను అనుకున్నానని.. ఇంట్లో వారు అడ్డు చెప్పలేదన్నారు. పైగా తాను సినిమాల్లో యాక్ట్ చేయటానికి ఇంట్లో ఫుల్ ఎంకేజ్ చేసినట్లు చెప్పింది. సైకాలజీ చదువుతున్న తాను సినిమాల్లో అవకాశాల కారణంగా మధ్యలో ఆపేసినట్లు చెప్పింది. సో.. సైకాలజీ కోర్సు మధ్యలో ఆగినా.. అను కెరీర్ మాత్రం ఓ రేంజ్లో దూసుకెళుతుందని చెప్పక తప్పదు.
పెరిగింది అమెరికాలోనే అయినా.. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే అనుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు.
వ్యక్తిగత విషయాలను వీలైనంత సెన్సార్ చేసి చెప్పే సెలబ్రిటీలకు భిన్నంగా కాస్త ఓపెన్ గా మాట్లాడే తత్త్వం అనులో ఎక్కువే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎవరూ ఊహించని విషయాన్ని చెప్పారు. తన ఫస్ట్ క్రష్ నాలుగో తరగతిలోనే ఏర్పడిందన్న ఆమె.. ఇప్పుడా విషయాన్ని తలుచుకుంటే నవ్వొస్తుందని చెప్పింది.