ఫోటో స్టొరీ: చంపుతున్నావ్ అను పాప!!

Update: 2019-12-01 06:02 GMT
నాని సినిమా 'మజ్ను' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళం భామ అను ఇమ్మాన్యుయేల్.  ఈ బ్యూటీ ఇండియన్ కాదు.. కేరళ మూలాలున్న అమెరికన్.  మొదట్లో లక్కు ఫుల్లుగా ఉండడంతో వరసగా టాప్ లీగ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ సినిమాలలో అవకాశాలు సాధించి చాలామందిని అసూయతో ఈనో ప్యాకెట్లు తాగే పరిస్థితి కల్పించింది. అయితే  'అజ్ఞాతవాసి'.. 'నా పేరు సూర్య' రెండు సినిమాలు ఫ్లాప్  కావడంతో అను కెరీర్ అనుకున్నంతగా టేకాఫ్ కాలేదు.

కెరీర్ టేకాఫ్ అయినా..  కాకపోయినా ఈ జెనరేషన్ భామలు  సోషల్ మీడియాలో హీటు పెంచడం ఆపరు కదా? అసలే ట్రంపుల్యాండు వాసి.. హాట్ నెస్ అనేది డ్రెస్సులోనే కాదు.. బాడీలో అణువణువునా ఉంటుంది.. ఆ అణువుల్లో ఎప్పుడూ ఏడుస్తుండే పరమాణువుల్లోనూ.. వాటిలో గిర్రున తిరుగుతూ ఉండే ప్రోటాన్... ఎలెక్ట్రాన్లలో కూడా ఆ హాట్ నెస్ ఉంటుంది.  ఇదంతా బయాలజీలో ఫిజిక్స్ అని మనం సరిపెట్టుకోవచ్చు.  ఈ సంగతి పాపకు కూడా తెలిసే ఉంటుంది.. అందుకే కత్తిలాంటి రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో ఏదో షాపింగ్ మాల్ లో ఓ కత్తి లాంటి డ్రెస్ ధరించి సూపర్ హాట్ సుందరిలా పోజులిచ్చింది.

ఈ ఫోటోకు అనును అనుసరించే ఎంతోమంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. లైక్స్ కొట్టుకున్నారు.. వారి జేజేలు తెలిపారు.  "సింప్లీ సూపర్.. నువ్వో క్వీన్".. "నన్ను పెళ్ళి చేసుకుంటావా?".. "చంపుతున్నావ్ అను పాపా".. "బ్యూటిఫుల్ ఏంజెల్" అంటూ కామెంట్లు పెటారు. ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటేప్రస్తుతం చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు.  చివరిగా తెలుగులో 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో నటించింది.  తమిళంలో చివరి సినిమా 'నమ్మ వీట్టు పిల్లై' ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ అయింది.


Tags:    

Similar News