ఫేడ్ ఔట్‌ హీరోయిన్‌ అవసరమా శర్వా?

Update: 2020-10-16 00:30 GMT
శర్వానంద్‌ హీరోగా ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహాసముద్రం మూవీలో హీరోయిన్‌ గా అధితి రావు హైదరి హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. మహాసముద్రం సినిమా వచ్చే నెలలో సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌ పాత్రకు గాను అను ఎమాన్యూల్‌ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో అను ఎమాన్యూల్‌ దాదాపుగా ఫైనల్‌ అయినట్లే అంటున్నారు.

శర్వానంద్‌ ఈమద్య కాలంలో సక్సెస్ లేక ఢీలా పడిపోయాడు. ఇలాంటి సమయంలో ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌ అను ఎమాన్యూల్‌ ను ఈ సినిమాలో నటింపజేయడం శర్వా అభిమానులకు కాస్త ఇబ్బంది ఉందంటూ సోషల్‌ మీడియాలో టాక్‌. చూడ్డానికి చక్కగా ఉన్నా కూడా అను ఎమాన్యూల్‌ లక్‌ సరిగా లేక చేసిన సినిమాలన్నీ కూడా బొక్క బోర్లా పడ్డాయి. మరి మహాసముద్రంలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర చేసినా కూడా సక్సెస్‌ ను దక్కించుకుని ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌ లో బిజీ అవుతుందేమో చూడాలి. మహా సముద్రం దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పూత్‌ ఒక్కసారిగా స్టార్‌ అయ్యింది. కనుక ఈ సినిమాతో కూడా ఈ ఇద్దరు హీరోయిన్స్‌ టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్స్‌ వరుసగా సినిమాలు చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News