పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు లాగా ఏళ్లకు ఏళ్లు ఒక సినిమా మీద ఖర్చు చేసే పరిస్థితి లేదిప్పుడు. పవన్ సినిమాల కోసం ఇక గరిష్టంగా ఏడాదిన్నర మాత్రం వెచ్చించగలడు. ఈ లోపు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్న పట్టుదలతో ఒకేసారి మూడు ప్రాజెక్టుల్ని తెరమీదికి తెచ్చేశాడు. అందులో మొదటి సినిమా ‘కాటమరాయుడు’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆగకుండా శరవేగంగా సాగిపోతోంది. షూటింగ్ చివరి దశకు వచ్చేయగా.. మరోవైపు సాంకేతిక హంగులు కూడా సిద్ధమైపోతున్నాయి. ఈ చిత్రం కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అప్పుడే ఆల్బమ్ రెడీ చేసేశాడట.
‘కాటమరాయుడు’ కోసం ఆరు పాటలు సిద్ధం చేసినట్లు వెల్లడించాడు అనూప్. ఈ పాటలకు పవన్ తో పాటు దర్శకుడు డాలీ ఆమోద ముద్ర కూడా పడిపోయిందట. పాటల్ని ఇప్పటికే రికార్డు చేయడం కూడా అయిపోయిందని అనూప్ తెలిపాడు. ఇప్పటిదాకా తన కెరీర్లో బెస్ట్ ఆల్బమ్ ‘కాటమరాయుడు’నే అని అనూప్ తేల్చేయడం విశేషం. ఇష్క్.. మనం.. గుండెజారి గల్లంతయ్యిందే లాంటి మెమొరబుల్ ఆల్బమ్స్ ఇచ్చిన అనూప్.. ‘కాటమరాయుడు’ ది బెస్ట్ ఆడియో అనేస్తున్నాడంటే ఇది చాలా ప్రత్యేకమే అయి ఉండాలి. ఫిబ్రవరిలో ‘కాటమరాయుడు’ ఆడియో విడుదలయ్యే అవకాశముంది. సినిమాను మార్చి నెలాఖరులో విడుదల చేయాలనుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/