అనుపమ పరమేశ్వరన్... ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆ మాటకొస్తే తమిళం, మలయాళ సినీ పరిశ్రమల్లోనూ ఈ అమ్మడు ఇప్పడు హాట్ కేక్. చిన్న సినిమాల నిర్మాతలంతా ఇప్పుడు ఆమె చుట్టూనే తిరుగుతున్నారు. ప్రేమమ్ సినిమాతో మలయాళ చిత్ర సీమలో అడుగుపెట్టిన అనుపమ... మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. తరవాత తెలుగులో "అ ఆ" సినిమాలో గయ్యాళిపాత్రలోనూ అందరినీ మెప్పించింది. ప్రేమమ్ సినిమాను తెలుగులో తీసినప్పుడు నిర్మాతలూ - దర్శకుడూ మిగతా నటీనటులను మార్చినా అనుపమను మాత్రం మార్చకుండా అలాగే ఉంచారు.
ఈ క్రమంలో... ప్రేమమ్ తెలుగులోనూ పెద్ద హిట్ కావడంతో అందరి దృష్టీ ఈ ముద్దుగుమ్మపై పడింది. ఆ తరవాత అనుపమకు "శతమానం భవతి"లో అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా "గౌతమీపుత్ర శాతకర్ణి" - "ఖైదీ నం.150" లాంటి హేమాహేమీ చిత్రాల మధ్య విడుదలైనా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో అనుపమకు గోల్డెన్ లెగ్ అని పేరు వచ్చేసింది.
ఇప్పటివరకూ ఆమె నటించిన సినిమాలన్నీ హిట్లు కావడంతో నిర్మాతలంతా ఇప్పుడు అనుపమ పేరునే జపిస్తున్నారట. ప్రత్యేకించి చిన్న నిర్మాతలు.. ఆమె నటిస్తే తమ సినిమా హిట్టవుతుందని ఆమెను ఆశ్రయిస్తున్నారట. ఇంతలో అనుపమకు... రామ్ చరణ్ - దర్శకుడు సుకుమార్ సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయితే, దీన్ని అంతా మన మంచికే అనుకుంటున్నారట చిన్న నిర్మాతలు. అనుపమ ఆ ప్రాజెక్టులోకి వెళ్తే భవిష్యత్తులో ఆమె రెమ్యునరేషన్ పెరిగిపోయేదనీ, తమకు అందుబాటులో ఉండకపోయేదనీ వారి ఆవేదన. సో, ఇప్పుడు... అనుపమ మిడ్ రేజ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ అన్నమాట. ఆల్ ద బెస్ట్ అమ్మడూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/