అది మాత్రం అడగొద్దు.. నేను ఇంకా చిన్నమ్మాయినే

Update: 2020-12-19 23:30 GMT
మలయాళం ప్రేమమ్‌ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ తెలుగులో ఆరంభంలోనే మంచి సక్సెస్‌ లను దక్కించుకుంది. తెలుగులో ఈమె స్టార్‌ హీరోయిన్‌ గా ఎదగడం ఖాయం అనుకున్న సమయంలో ఈమెకు లక్‌ కలిసి రాలేదు. దాంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఇతర భాషల్లో ఈమె సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడిని చాలా మంది పెళ్లి గురించి పదే పదే ప్రశ్నిస్తున్నారట. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటూ అడుగుతున్నారట.

తన పెళ్లి గురించి జనాలు అడుగుతున్న ప్రశ్నకు క్లీయర్‌ గా సుత్తి లేకుండా సమాధానం చెప్పేసింది. నా వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే.. నేను ఇంకా చాలా చిన్నమ్మాయిని. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు అంది. ఆమె తీరు చూస్తుంటే 35 ఏళ్ల వరకు కూడా పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్స్‌ మూడు పదుల వయసు దాటే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటం కామనే. అనుపమ కూడా మూడు పదుల వయసు దాటిన తర్వాత మరో అయిదు సంవత్సరాలు ఆగి మరీ పెళ్లి చేసుకునేలా ఉంది.
Tags:    

Similar News