మలయాళ బ్యూటీకి మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయిగా..!

Update: 2020-11-22 01:30 GMT
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అ ఆ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇక్కడ కూడా సక్సెస్ అందుకుంది. 'ప్రేమమ్' 'శతమానం భవతి' 'ఉన్నది ఒకటే జిందగీ' 'కృష్ణార్జున యుద్ధం' 'హలో గురూ ప్రేమ కోసమే' 'రాక్షసుడు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలో అనుపమ మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కి జోడీగా నటిస్తోంది.

నిఖిల్ హిట్ సినిమా 'కార్తికేయ' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'కార్తికేయ 2' చిత్రంలో అనుపమ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ నిర్మిస్తున్నారు. దీంతో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న '18 పేజెస్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న ఓ సినిమాలో అనుపమ న‌టిస్తోంద‌ని కాస్టింగ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ బ్యూటీ ఏజ్ త‌క్కువ అవ్వ‌డం వల్ల అవకాశాలు బాగానే వస్తున్నాయని సినీ వర్గాల్లో అంటున్నారు.
Tags:    

Similar News