తెలుగు ఇండస్ట్రీలో దూకుడు పెంచింది కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. గత యేడాది బెల్లంకొండ సాయికిరణ్ సరసన 'రాక్షసుడు' సినిమాలో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఒకేసారి మూడు చిత్రాలను లైన్లో పెట్టి జోరు కొనసాగిస్తోంది.
సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న '18 పేజీస్' చిత్రంలో అనుపమా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
మరోవైపు.. దిల్ రాజు బంధువు ఆషిష్ రెడ్డి హీరోగా 'హుషారు' చిత్ర దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కిస్తున్న 'రౌడీ బోయ్స్'లోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ కేరళ కుట్టి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇక.. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మలయాళ చిత్రం 'హెలెన్' రీమేక్ సైతం తనఖాతాలోనే పడిందని చెప్పింది అనుపమ. పీవీవీ సంస్థతో కలిసి దిల్ రాజు నిర్మించే 'హెలెన్' రీమేక్ లో తాను నటిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మూడు చిత్రాలతోనూ వచ్చే యేడాది తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది అనుపమ పరమేశ్వరన్.