'అర్జున్ సురవరం' సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. నిఖిల్ హిట్ సినిమా 'కార్తికేయ' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'కార్తికేయ 2' చిత్రంలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. దీంతో పాటు నిఖిల్ 'కుమారి 21ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. వీటితో పాటు నిఖిల్ తన కెరీర్లో 20వ ఈ చిత్రాన్ని నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ నిర్మాణంలో చేయనున్నారు. అయితే ఇప్పుడు 'కార్తికేయ 2' మరియు '18 పేజెస్' రెండు సినిమాలలో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
'అ ఆ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ 'ప్రేమమ్' 'శతమానం భవతి' 'ఉన్నది ఒకటే జిందగీ' 'కృష్ణార్జున యుద్ధం' 'హలో గురూ ప్రేమ కోసమే' 'రాక్షసుడు' వంటి సినిమాల్లో నటించింది. 'రాక్షసుడు' సినిమా విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత ఎందుకో తెలుగులో అనుపమకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కాస్త గ్యాప్ వచ్చి రేస్ లో వెనుకబడిపోయింది. అయితే ఇప్పుడు నిఖిల్ సిద్దార్థ్ నటించే 'కార్తికేయ 2' మరియు '18 పేజెస్' సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నారు. చందు మొండేటితో 'ప్రేమమ్' సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఆ పరిచయంతో 'కార్తికేయ 2' లో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. ఇప్పుడు '18 పేజెస్' లో కూడా అనుపమనే హీరోయిన్ గా తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.