మన దగ్గర మీడియా వాళ్లు లేనట్లు ఆ మధ్య బాలీవుడ్ నుంచి అనుపమ చోప్రాను పిలిపించుకుని స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మన మీడియా వాళ్లు నొచ్చుకోవడం చూసే తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లున్నాడు కానీ.. అనుపమకు ఇచ్చిన ఇంటర్వ్యూకు వచ్చిన మైలేజి..ప్రచారం ఇక దేనికీ రాలేదన్నది వాస్తవం. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు బాలీవుడ్లో ప్రచారం కల్పించడం కోసం అనుపమ ఈ రకంగా ఏదో సాయం చేసేస్తోందని జనాలు ఫీలయ్యారు కానీ.. అసలు కథ వేరే ఉందని ఇప్పుడు అర్థమవుతోంది.
అనుపమకు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల పవన్ కు ఒరిగిందేమీ లేదు కానీ.. పవన్ వల్ల అనుపమకు మాత్రం బాగానే లాభం చేకూరుతోంది. ఆ ఇంటర్వ్యూను అడ్డం పెట్టుకుని.. పవన్ ఎప్పుడూ చేయని పనికి ఒప్పించింది అనుపమ. ముంబయిలో తాను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న జియో మియామి ఫిలిం ఫెస్టివల్ కు పవన్ మద్దతు దక్కించుకుంది అనుపమ. పవన్ తో పాటు మరికొందరు సూర్య లాంటి సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ కు మద్దతు ప్రకటించారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్.. దీపికా పదుకొనే లాంటి వాళ్లు ఈ ఫిలిం ఫెస్టివల్ కు సహకారమందిస్తున్నారు. పవన్ ఈ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పవన్ ఇంటర్వ్యూ చేసేటపుడే ఈ ఫెస్టివల్ సంగతి దృష్టిలోపెట్టుకున్నట్లుంది అనుపమ.