అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా కొత్త సినిమా విఠలాచార్య మొదలైంది. నందినీ నర్సింగ్ హోం తర్వాత.. నవీన్ విజయ్ కృష్ణ హీరోగా రూపొందనున్న రెండో చిత్రంలో అనీషాను హీరోయిన్ ను ఎంపిక చేశారు. తాజాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ తొలి షాట్ కు క్లాప్ కొట్టగా.. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
రీసెంట్ గా ఫ్యాషన్ డిజైనర్ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన విశాఖపట్నం బ్యూటీ అనీషా అంబ్రోస్ కు విఠలాచార్యతో మరో అవకాశం దక్కిందని చెప్పాలి. నిజానికి ఈమె కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా పడలేదు. నాలుగేళ్ల క్రితం అలియాస్ జానకి అనే మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు అనే షార్ట్ ఫిలిం.. గోపాలా గోపాలా చిత్రంలో కేమియో రోల్.. రన్.. మనమంతా.. కన్నడలో సెకండ్ హ్యాండ్ లవర్.. కర్వాలతో పాటు మలయాళంలో విస్మయం చిత్రాల్లో కూడా నటించింది అనీషా.
తాజాగా వంశీ సినిమా ఫ్యాషన్ డిజైనర్ లోనూ చేసింది. ఇన్ని చేసినా ఈమెకు హిట్ దక్కలేదు. నిజానికి ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితేనే ఐరన్ లెగ్ అని ముద్ర వేసేసి అవకాశాలు ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ ముందుకు రారు. అలాంటిది.. అనీషా ఆంబ్రోస్ కు ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా.. ఇన్నేసి అవకాశాలు వస్తుండడం ఆమె అదృష్టంగానే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/