నాకంత పెద్ద మనసు లేదు - అనుష్క

Update: 2015-10-07 16:30 GMT
మనసుకు నచ్చిన పాత్ర వస్తే ఫ్రీగా సినిమా చేయడానికి కూడా నేను రెడీ అని ఘనంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు సినీ జనాలు. కానీ తాను మాత్రం ఆ టైపు కాందంటోంది అనుష్క. ఫ్రీగా సినిమాలు చేసేంద దయార్ద్ర హృదయురాలిని తాను కానని ఖరాఖండిగా చెప్పేసింది అనుష్క. తాను ఎంత కష్టపడితే.. దానికి తగ్గట్లు అంత పారితోషకం కచ్చితంగా డిమాండ్ చేస్తానని అనుష్క చెప్పింది. అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్ ‘రుద్రమదేవి’లో ఉచితంగా నటించారని గుణశేఖర్ చెబుతున్న నేపథ్యంలో అనుష్క కూడా ఫ్రీగా చేసిందేమో అన్న ప్రశ్నను ఆమె ముందుంచితే మొహమాటం లేకుండా ఈ మాటలంది.

‘‘పాత్రలు నచ్చితే ఉచితంగా నటిస్తా.. ఈ తరహా మాటలు నేను మాట్లాడను. సినిమా కోసం ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి తగ్గ పారితోషకం తీసుకోవాల్సిందే. నేను నాకు ఎంత రావాలో అంత తీసుకుంటాను. ఉచితంగా సినిమాలు చేసేంత పెద్ద మనసు నాకు లేదు’’ అని ఖరాఖండిగా చెప్పేసింది అనుష్క. రుద్రమదేవి లాంటి సినిమాల కోసం తాను పడ్డ కష్టం తనకు మాత్రమే తెలుసని.. ఐతే ఇలాంటి పాత్రలు పోషించినపుడు ఆ ఆత్మసంతృప్తే వేరని అనుష్క చెప్పింది. ఇంతకుముందు ‘అరుంధతి’ సినిమాకు పడ్డ కష్టం కంటే ఇందులో రెట్టింపు శ్రమించానని జేజెమ్మ తెలిపింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం కూడా తన ఒంటిని చాలా కష్టపెట్టుకున్నానని.. ఐతే ఔట్ పుట్ చూశాక, జనాలు సినిమాను ఆదరించాక ఆ కష్టమంతా ఎగిరిపోతుందని అనుష్క అంది.
Tags:    

Similar News