క్రికెటర్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు.. హాట్ పెయిర్ అనే సంగతి తెలిసిందే. ఒకసారి బ్రేకప్ అయ్యారనే న్యూస్ ఉన్నా.. మళ్లీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. రీసెంట్ గా ఈ ప్రేమజంట ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఒకరితో ఒకరు ఒకరికి ఒకరు అన్నట్లుగా ఈ జంట సందడి చేశారు.
వైట్ అండ్ వైట్ లో మ్యాన్లీగా విరాట్.. గ్రీన్ డ్రెస్ లో అనుష్క కలిసి తిరిగారు. చూసేందుకే కనుల విందుగా ఉన్న ఈ జంట.. ఏ మాత్రం మొహమాటాలు లేకుండా.. ఫోటోలు తీసుకునేవాళ్లను ఏ మాత్రం ఖాతరు చేయకుండా హంగామా చేశారు. ఇంత ఓపెన్ గా తిరిగేస్తూ హడావిడి చేయడం లాంటివి ఈ ప్రేమ జంట ఏమాత్రం బెరుకు లేకుండా చేసేస్తుండడం విశేషం. ఇదొక్కటే కాదు.. వరుసగా అదే స్పీడ్ లో మరో ఈవెంట్ లో కూడా కనిపించారు. ఇద్దరూ కలిసి జంటగా యువరాజ్ సింగ్-హేజల్ కీచ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ కు కూడా హాజరయ్యారు. గోవాలో జరిగిన ఈ ఈవెంట్ కు చాలామంది సెలబ్రిటీలే వచ్చినా.. విరాట్-అనుష్కల పెయిర్ సంథింగ్ స్పెషల్.
రిసెప్షన్ వేడుకలో అయితే అనుష్క శర్మ.. హేజల్ జెల్ కీచ్ లు సెనోరీటా పాటకు స్టెప్పులు కుమ్మేస్తే.. ఆ తర్వాత యువరాజ్.. విరాట్ లు కూడా డ్యాన్సులో భాగం అయ్యారు. రెండు జంటలు కలిసి గంగ్నం స్టైల్ సాంగ్ కు వేసిన స్టెప్పులైతే అదరహో అనాల్సిందే. రిసెప్షన్ కు ముందు యువరాజ్-హాజెల్ ల పెళ్లికి కూడా విరాట్-అనుష్కల జంట హాజరైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/