ఆవిడ 'భాగ‌మ‌తి' ఆగిపోలేదు

Update: 2015-10-19 05:15 GMT
స్వీటీ అనుష్క రుద్ర‌మ‌దేవి 3డి స‌క్సెస్‌ ని ఎంజాయ్ చేస్తోంది. ఈ ఆనంద‌వేళ బాహుబ‌లి 2లో న‌టించేందుకు అవ‌స‌ర‌మైన విధంగా త‌న‌ని తాను మ‌లుచుకుంటోంది. సేమ్ టైమ్ సింగం3 ప్రిప‌రేష‌న్‌ లోనూ ఉంది. అయితే ఇటీవ‌లి కాలంలో విస్ర్తతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చి ఆగిపోయిన ప్రాజెక్టు ఒక‌టి తిరిగి లైమ్‌ లైట్‌ లో కొచ్చింది.

అనుష్క టైటిల్ పాత్రధారిగా, పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో భాగ‌మ‌తి చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే మ‌ధ్య‌లోనే ఆ చిత్రం క్యాన్సిల్ అయ్యింద‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఆ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు యువి క్రియేష‌న్స్ సంస్థ రెడీ అవుతోంద‌న్న‌ది తాజా వార్త‌.

భాగ‌మ‌తి క్యాన్సిల్ చేసుకుని పిల్ల జ‌మీందార్ అశోక్ అంజ‌లితో చిత్రాంగ‌ద సినిమా చేస్తున్నాడు. భాగ‌మ‌తి కథ‌నే చిత్రాంగ‌ద‌గా చూపిస్తున్నాడు అంటూ ప్ర‌చార‌మైంది. కానీ అది ఫాల్స్ న్యూస్ అని చెబుతోంది యువి క్రియేష‌న్స్‌. త్వ‌ర‌లోనే అశోక్ భాగ‌మ‌తి క‌థ‌ని అనుష్క‌కి వినిపించ‌డానికి వెళుతున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ కి వెళుతుంది. అంజ‌లి చేస్తున్న సినిమా వేరే అని చెబుతున్నారు. స్వీటీ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్టుల‌న్నీ అయిపోయాక భాగ‌మ‌తి కోసం ప్రిపేర‌వుతుంద‌ని అంటున్నారు. అదీ మ్యాట‌రు.
Tags:    

Similar News