బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి రోజుకో అప్ డేట్ తెలుస్తోంది. ఒక్కో అప్ డేట్ ఎంతో ఎగ్జయిటింగ్. బాహుబలి సాధించిన అసాధారణ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, బాహుబలి 2 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ తో కలిసి బాహుబలి 2 వివజుల్స్ ఎలా ఉండాలి? అన్న చర్చల్లో తలమునకలుగా ఉన్నారు. స్క్రిప్టు సహా అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ లో సెట్స్ కెళ్లాలన్నది ప్లానింగ్.
అయితే ఈ సినిమాకి తండ్రి కొడుకులు విజయేంద్ర ప్రసాద్ -రాజమౌళి ద్వయం ఎంతో నేర్పుతో కథల్ని అల్లుతున్నారన్నది జగమెరిగిన సత్యం. బాహుబలి పార్ట్ 1లో క్లయిమాక్స్ ని అసాధారణమైన ట్విస్టుతో సస్పెన్స్ తో ముగించారు. ఇక రెండో భాగంలో ఆ సస్పెన్స్ కి తెరవీడనుంది. అందుకు తగ్గట్టే కథలో మసాలా అద్దుతున్నారు. అయితే పెర్ఫామెన్సెస్ పరంగా మొదటి భాగానికి, రెండో భాగానికి వేరియేషన్ కోసం ప్రయత్నిస్తున్నారట. విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై ముచ్చటిస్తూ.. నటీనటుల ప్రదర్శనలో సంథింగ్ ఇంకేదైనా కొత్తగా చూపించాలనుకుంటున్నాం. కథ ప్రకారం దేవసేన చుట్టూ సినిమా తిరుగుతుంది... అంటూ చెప్పుకొచ్చారు. శివుడు దేవసేనను కాపాడి కోట దాటించే ముందు భళ్లాలదేవునిపై దేవసేన ఎలాంటి పగ ప్రతీకారాన్ని పెంచుకుందో ఆ చింతనిప్పుల్లాంటి కళ్లలో చూపించారు. కాబట్టి ఇక రెండో భాగంలో భళ్లాల దేవునిపై ప్రతీకారం అన్న ఎపిసోడ్ దేవసేనతోనే ముడిపడి ఉంది. ఆ యాంగిల్ లోనే కథని రెడీ చేస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది.
బాహుబలి పార్ట్ 3 గురించిన ఆసక్తికరమైన అప్ డేట్ కూడా బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి వచ్చింది. బాహుబలి 1 - 2 భాగాలతో ఏ సంబంధం లేకుండా బాహుబలి 3 కథ ఉంటుంది. పూర్తి స్వేచ్ఛగా ఆ కథని రాస్తారు. ఒకవేళ ఆ కథలోకి ఏలియన్ - ప్రిడేటర్ ప్రవేశించినా ఆశ్చర్యనపోనక్కర్లేదు. ఇది మన తెలుగు సినిమా స్థాయిని పెంచేదిగానే ఉంటుందనడంలో సందేహమే లేదు. ఒకవేళ బాహుబలి వర్సెస్ ప్రిడేటర్ తీస్తారేమో?