తెగింపు అనేది ఆల్వేస్ డిస్కషన్ పాయింట్. పాత్రలోకి పరకాయం చేయడం కోసం కొందరు ఎలాంటి సాహసానికైనా రెడీ అయిపోతుంటారు. క్యారెక్టర్ స్కిన్ లోకి దూరిపోవాలంటే బోలెడంత తెగువ చూపిస్తుంటారు. విశ్వనటుడు కమల్ హాసన్ రోజుకి 8 గంటలు మేకప్ కోసమే కేటాయించిన సందర్భాలున్నాయి. దశావతారం - భారతీయుడు వంటి సినిమాల కోసం మేకప్ కోసమే బోలెడంత టైమ్ ఓపిగ్గా స్పెండ్ చేయాల్సొచ్చేది. అవసరాన్ని బట్టి రూపం మార్చుకునేందుకు భారీగా కసరత్తులు చేసేవాడు.
ఆ తర్వాత కమల్ ఇన్ స్పిరేషన్ తోనే అజిత్ - శింబు - సూర్య లాంటి స్టార్లు తమ కెరీర్ లో ఎన్నో సాహసాలు చేశారు. అలాంటి తెగువ, సాహసం తెలుగు హీరోల్లో టార్చ్ వేసి వెతికినా దొరకడం కష్టమే కానీ, టాలీవుడ్ స్టార్ గా పాపులర్ అయిన అనుష్క మాత్రం ఆ లోటు లేకుండా బర్తీ చేస్తోంది. థాంక్ గాడ్! మనకి కూడా ఓ ఎక్స్ పెరిమెంటల్ లేడీ ఉందే అని అంతా సంతోషించేలా చేస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మక సినిమాలో నటించింది. అప్పట్లో లడ్డూ బాబు కోసం అల్లరి నరేష్ ప్రోస్థటిక్ మేకప్ ని ఆశ్రయించాడు. అసలే సన్నజాజి లా కనిపించే నరేష్ ని లడ్డూ లాగా చూపించడం కోసం దర్శకుడు - మేకప్ మేన్ చాలానే శ్రమించాల్సి వచ్చింది.
అయితే అలాంటి శ్రమ తన మేకర్స్ కి ఇవ్వకుండా స్వీటీ అనుష్క తీసుకున్న డేర్ డెషిసన్ ఆల్ టైమ్ హాట్ టాపిక్ అయ్యిందిప్పుడు. దాదాపు 20 కేజీల బరువు పెరిగింది. ఓ వైపు బాహుబలి - రుద్రమదేవి 3డి సినిమాల్లో నటిస్తూనే, సైజ్ జీరో సినిమా కోసం తను తీసుకున్న నిర్ణయం అసాధారణమైనదని పొగిడేస్తున్నారంతా. స్వీటీని దృష్టిలో పెట్టుకునే రాఘవేంద్రరావు కోడలు - ప్రకాష్ వైఫ్ కనికా థిల్లాన్ కథ - క్యారెక్టర్ రాసుకున్నారు. అందుకే స్వీటీ ఇంత సాహసం చేసిందదని, కమల్ హాసన్ లా తెగించిందని అనుకుంటున్నారు. స్వీటీ ఇంత శ్రమించినందుకైనా సైజ్ జీరో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.