రుద్రమదేవి ప్రమోషన్ హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు టైటిల్ పాత్రధారి అనుష్క, మరోవైపు గుణశేఖర్ డే బై డే ప్రమోషన్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్ లో నిన్నటిరోజున స్వీటీ అనుష్క ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పింది..
''రుద్రమదేవి 3డి కోసం కత్తియుద్ధాలతో పాటు గుర్రపు స్వారీలు చేయాల్సొచ్చేది. అలా చేయాలంటే ముందుగా ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాలి. నాకు గుర్రం అంటే చాలా భయం. ఓ గుర్రం సెట్స్ లో తెగ భయపెట్టేసేది. ఏనుగు దగ్గరకు వెళ్లినంత డేర్ గా గుర్రం దగ్గరకు వెళ్లలేను. కానీ గుర్రపుస్వారీ చేయాలి. అలాంటప్పుడు మా డైరెక్టర్ గారు ముందుకొచ్చేవారు. డైరెక్టర్ గారు గెట్ రెడీ అనగానే అది వెంటనే యాక్షన్ మోడ్ లోకి వచ్చేసేది'' అంటూ చెప్పింది. గుణశేఖర్ గొంతు వినగానే అది అటెన్షన్ లోకి వచ్చేసదట. అంతేకాదు ఆ గొంతు విని విని దానికి అలవాటైపోయినట్టుంది. ఆయన ఏం చెబితే అది వినేదట. ''మేం ఏం చెప్పినా లెక్క చేసేదే కాదు. అంత కమాండ్ గుణశేఖర్ లో ఉండేది...'' అని చెప్పింది స్వీటీ.
ఇదే విషయాన్ని నేరుగా గుణశేఖర్ నే ప్రశ్నిస్తే ఆయన కూడా నవ్వేస్తూ దానిని కన్ఫమ్ చేసేశారు. గెట్ రెడీ అనగానే ఆ గుర్రం మూవ్ మెంట్ లోకి వచ్చేసేది. నేను వేరే పనిలో ఉండి ఎవరితోనో గెట్ రెడీ అన్నా ఇది యాక్షన్ లోకి వచ్చేసేది. ఆ బాధ పడలేక చివరికి యాక్షన్ అంటూ డిక్షన్ మార్చుకున్నా. అయినా యాక్షన్ అన్న పదం విని తిరిగి యాక్టింగులోకి వచ్చేసేది ఆ గుర్రం. అంతగా మచ్చిక అయిపోయింది.. అంటూ సెట్ లో ఫన్నీ ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకుని నవ్వేశారాయన. ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ?