నిజమే దర్శకుడి కొడుకుతోనే అనుష్క వివాహం!

Update: 2020-06-18 04:15 GMT
టాలీవుడ్‌ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో ప్రభాస్‌ పెళ్లి గురించి ఏ స్థాయిలో ప్రచారం జరుగుతుందో అంతే స్థాయిలో అనుష్క వివాహం గురించి కూడా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. గత అయిదు ఆరు సంవత్సరాలుగా అనుష్క వివాహం గురించి మీడియాలో ఏవో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ఎక్కువగా వార్తలు వచ్చాయి. కాని తమది స్నేహం మాత్రమే అంటూ ఇద్దరు పలు సందర్బాల్లో క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అనుష్క ప్రేమ పెళ్లి గురించి మీడియాలో ప్రచారం జరిగింది.

ఆమద్య ఒక క్రికెటర్‌ తో అనుష్క పెళ్లి ఫిక్స్‌ అయ్యింది పెళ్లికి రెడీ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక దర్శకుడి కొడుకుతో పెళ్లికి అనుష్క రెడీ అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే ఆ దర్శకుడి కొడుకుకు అప్పటికే పెళ్లి అయ్యి విడాకులు కూడా అయ్యాయి. దాంతో అంతా కూడా అవాక్కయ్యారు. అయితే ఆ వార్తలు నిజం కాదని ఎక్కువ మంది అన్నారు. దాంతో నిజమే అనుష్కకు రెండవ పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఆ వార్తలను చాలా మంది నమ్మలేదు. కాని మళ్లీ ఆ వార్తలే ప్రముఖంగా వస్తున్నాయి.

ఆ దర్శకుడి కొడుకును అనుష్క వివాహం చేసుకోబోతున్న విషయం నిజమే అన్నట్లుగా ఇండస్ట్రీలో ప్రముఖంగా టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం అనుష్క చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే ఆయనతో పెళ్లికి రెడీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కుటుంబంకు అనుష్క చాలా క్లోజ్‌ గా మూవ్‌ అవుతుందనేది కొందరి వాదన. కాని అనుష్క అభిమానులు మాత్రం ఈ వార్త నిజం కాకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. రెండవ పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం ఏంటీ.. ఆయన సినిమాల్లో సక్సెస్‌ కాలేదు మరే విధంగా కూడా ఆయన అనుష్కకు సరి జోడీ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం.

మళ్లీ జోరుగా ప్రచారం జరుగుతున్న ఈ పుకార్లపై అనుష్క ఏమైనా రియాక్ట్‌ అవుతుందో చూడాలి. అనుష్క తాజా చిత్రం నిశబ్దంను డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు అనుష్కతో యూవీ క్రియేషన్స్‌ వారు మరో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News