‘బాహుబలి’తో అనుష్కకు పెద్ద కష్టమే

Update: 2015-12-23 11:30 GMT
34 ఏళ్ల వయసులో హీరోయిన్ గా కొనసాగడమే కష్టం అంటే.. అనుష్క చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. వచ్చే ఏడాది కూడా ఆమె డైరీలో ఖాళీ అన్నదే కనిపించేలా లేదు. ఒకటికి మూడు క్రేజీ ప్రాజెక్టులతో రాబోయే ఏడాదంతా బిజీ బిజీగా గడపబోతోంది అనుష్క. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఒళ్లు పెంచి విపరీతంగా శ్రమించిన అనుష్క.. ఇప్పుడు ఒంటి మీద ఉన్న అదనపు కేలరీల్ని కరిగించే పనిలో ఉంది. మళ్లీ మామూలుగా తయారవడానికి ఇంకో నెలకు పైనే పట్టేట్లుందని సమాచారం. ఆ తర్వాత ఒకేసారి మూడు సినిమాల షూటింగులో పాల్గొనాల్సి ఉంది అనుష్క.

బాహుబలి-2 షూటింగ్ ఇప్పటికే మొదలవగా.. అనుష్క ఎంటరవడానికి ఇంకా రెండు నెలల టైం ఉంది. ఫిబ్రవరిలో ఆమె పాత్ర తాలూకు షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. ఐతే రాజమౌళి సినిమా అంటే ఏదీ ఒక పట్టాన తెగదు. ఎంత ప్లాన్ చేసినా అనుకున్న ప్రకారం షూటింగ్ జరగదు. అంటే ఏడాదంతా కూడా ఎప్పుడు పడితే అప్పుడు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది అనుష్క. రెండో పార్ట్‌ లో అనుష్కది కీలక పాత్ర. హీరోతో సమానంగా ఆమె స్క్రీన్ టైం ఉంటుంది. కాబట్టి బాహుబలి విషయంలో అనుష్క చాలానే కష్టపడాల్సి ఉంది. ఇక బాహుబలి నుంచి కాస్త విరామం దొరికినపుడు వీలు చూసుకుని కృష్ణవంశీ సినిమా, సింగం-3 చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే మొదలు కాబోతుండటం విశేషం. రెండింట్లోనూ అనుష్కది కీలక పాత్ర. మరి బాహుబలి-2లో చేస్తూ అనుష్క ఈ రెండు సినిమాల షూటింగ్ ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News