20 కేజీలు కోసేస్తేనే దేవసేన అయ్యేది

Update: 2015-07-21 06:01 GMT
స్వీటీశెట్టి అలియాస్‌ అనుష్క శెట్టి 'బాహుబలి'లో కేవలం ఐదు నిమిషాలే కనిపించి అభిమానుల్ని నిరాశపరిచింది. అదీ ఓ వికృతరూపంలో కనిపించి షాకిచ్చింది.  అయితే అదంతా విజయేంద్ర ప్రసాద్‌ మలిచిన దేవసేన క్యారెక్టర్‌ ని పండించడం కోసమే.

అయితే ఇప్పుడు బాహుబలి పార్టు 2 సెట్స్‌ కెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ నుంచే షూటింగ్‌. ప్రభాస్‌, రానా అండ్‌ గ్యాంగ్‌ భారీ కసరత్తులు మొదలెట్టేయబోతున్నారు. రెండో భాగంలో భీకరమైన పోరాటాలకు తగ్గట్టే శరీరాల్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఈ రెండో భాగంలో ఈ అందరికంటే అనుష్క పార్ట్‌ ఎక్కువ. అక్కడ రాకుమారిగా ఓ అందాల రాకుమారుడితో రొమాన్స్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడో చిక్కొచ్చిపడింది. స్వీటీ రాకుమారి కావాలంటే ఇప్పుడున్న బరువు కంటే దాదాపు రూ.20కేజీలు తగ్గాల్సి ఉంటుంది. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో పివిపి నిర్మిస్తున్న 'సైజ్‌ జీరో' చిత్రం కోసం అప్పట్లో 20కేజీల అదనపు బరువు పెరిగింది. ఇప్పుడు అదంతా కరిగించాల్సిందే. లేదంటే స్లిమ్ముగా రాకుమారిలా కనిపించడం కష్టం.

ఇప్పటికే సైజ్‌ జీరో చిత్రీకరణ పూర్తయింది కాబట్టి స్వీటీ జిమ్ముల్లో కసరత్తులు చేయడానికి రెడీ అవుతోంది. యోగా, ధ్యానం వంటి పవర్‌ఫుల్‌ ఆప్షన్స్‌ని ఎంపిక చేసుకుంటోంది. అంతేకాకుండా ఫైబర్‌ డైట్‌ తో చాలా కేలరీస్‌ ఇన్‌ టేక్‌ కట్‌ చేసి త్వరలోనే దేవసేన లుక్కులోకి వచ్చేస్తుందట. రాకుమారి అవ్వాలంటే ఎన్ని కష్టాలో పాపం..
Tags:    

Similar News