మిగతా వారికంటే థమన్ 50 శాతం తక్కువే!
థమన్ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల న్నింటికి అతడే సంగీతం అందిస్తున్నాడు
థమన్ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల న్నింటికి అతడే సంగీతం అందిస్తున్నాడు. కొంత కాలంగా అతడి హవా నడుస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న `గేమ్ ఛేంజర్` కి కూడా తమన్ పనిచేస్తున్నాడు? అంటే అతడు ఏ స్థాయికి చేరుకున్నాడు? అన్నది అద్దం పడుతుంది. మ్యూజికల్ గా థమన్ ఇంతవరకూ ఫెయిలైంది లేదు. అన్ని సినిమాలకు ది బెస్ట్ అందించాడు.
అందులోనూ `ఆర్ ఆర్ ఆర్` అందించడంలో? థమన్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇవన్నీ చెక్ చేసుకునే? థమన్ అయితే బాగుంటుందని శంకర్ తీసుకున్నారు. ఈ క్రమంలో థమన్ పారితోషికం భారీగా పెంచేసాడు? అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్లలో అత్యధిక పారితోషికం తీసుకుటుంది థమన్ మాత్రమేనంటూ ప్రచారం ఠారెత్తిపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న థమన్ ముందుకెళ్లింది.
దీనికి థమన్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. `అదంతా అబద్దం. నేను మిగతా వారి కంటే 50 శాతం తక్కువ పారితోషకమే తీసుకుంటున్నాను. నేను నిర్మాతల్ని ఇంత ఇవ్వండని డిమాండ్ చేయను. నాకు ఎంత ఇవ్వాలో ..నేను ఎంత తీసుకోవాలో నాకు తెలుసు. లెక్క గట్టి చూస్తే మిగతా వారికంటే 50 శాతం తక్కువగానే ఉంటుంది. నాతో పని చేసిన నిర్మాతలంతా కంపర్ట్ గా ఉన్నారు. నేను నిజంగా భారీగా డిమాండ్ చేసి ఉంటే? ఆ ప్రచారం ఇంకా బలంగా వెళ్లేది.
మీతో పాటు చాలా మంది ఇదే ప్రశ్న పదే పదే అడిగేవారు. అలా లేదు? అంటే నా పనికి తగ్గట్టే నేను తీసుకుంటున్నట్లుగా. కానీ నేను చేసే సంగీతం విషయంలో క్వాలిటీ ఎక్కడా తగ్గడానికి ఒప్పుకోను. నిర్మాత అంత పెట్టలేను అని మధ్యలో అంటే? ఆ డబ్బు నేను పెట్టి పూర్తి చేసి ఔట్ పుట్ ఇచ్చేస్తాను. ఎందుకంటే? నాకు నా వృత్తి తల్లితో సమానం. ఆ తల్లిని మధ్యలో ఎలా వదిలేయగలం? అందుకే ప్రోఫెషనల్ గా ఎక్కడా రాజీ పడను` అన్నారు.