బ్రేకప్ అన్నారు.. బాగానే ఉన్నారుగా..

Update: 2016-11-01 06:31 GMT
అప్పట్లొ క్రికెటర్ విరాట్ కొహ్లీకి హీరోయిన్ అనుష్క శర్మ గుడ్ బాయ్ చెప్పేసిందని అన్నారు. అయితే వీరిద్దరూ నిజంగానే కాస్త దూరం అయినా కూడా.. అనుష్క తమ్ముడు అప్పట్లో విరాట్ తో పైరవీలు జరిపాడని.. ఆ తరువాత వీరు కలసిపోయారని కూడా టాక్ వచ్చింది. కాకపోతే ఈ ఇష్యూ జరిగాక అసలు విరాట్ ఆడే ఒక్క మ్యాచ్ కు కూడా అనుష్క రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరూ కలసి దీపావళి సంబరాలు జరుపుకుంటూ.. ప్రపంచానికి ఒక పాయింట్ ప్రూవ్ చేశారు.

గత ఆదివారం ఢిల్లీలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్ చూడ్డానికి విరాట్ తో కలసి విచ్చేసింది అనుష్క. ఐఎస్ ఎల్ లో గోవా జట్టుకు యజమాని కొహ్లీ. ఇప్పుడు తన గాళ్‌ ఫ్రెండ్ తో కలసి అక్కడ టీమ్ తో దీపావళి జరపుకోవడమే కాదు.. చక్కగా ఫ్యాన్స్ తో బెలెడన్ని ఫోటోలు కూడా దిగారు.  విరాట్ తన టీమ్ జెర్సీలో దర్శనమిస్తే.. అనుష్క సాంప్రదాయ లుక్ లో ఇరగదీసింది. చూస్తుంటే ఇద్దరూ బాగానే ఉన్నారనే సంగతి అర్ధమవుతోంది. సర్లేండి.. ఇప్పటికే బాలీవుడ్ బోలెడన్ని బ్రేకప్పులు చూసి విస్తుపోయింది. వీళ్లన్నా చక్కగా కలిసుండాలని కోరుకుందాం.

ఇకపోతే అనుష్క సుల్తాన్ సినిమా తరువాత ఇప్పుడు ఏ దిల్ హై ముష్కిల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటే.. మరో ప్రక్కన విరాట్ హ్యాపీగా న్యూజిలెండ్ పై వన్డే సిరీస్ గెలిచిన ఆనందంలో.. నవంబర్ 9 నుండి మొదలయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News