బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ తాజా చిత్రం ‘సుయ్ దాగా’. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ఉత్తరాధిన అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా జాతీయ అవార్డు గ్రహీత శరత్ కటారియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఒక పల్లెటూరులోనే ఈ చిత్రం మొత్తం సాగుతుంది. సినిమాలో హీరో పాత్రకు, సైకిల్ కు మద్య ఆసక్తికర సన్నివేశాలుంటాయి. ‘సుయ్ దాగా’ చిత్రంలో హీరో తన కష్ట సుఖాలను, ఆనందాన్ని ఎప్పటికప్పుడు సైకిల్ తో పంచుకుంటూ ఉంటాడు. ఆత్మ విశ్వాసంతో జీవనం సాగించే వ్యక్తి కథాంశంతో ఈ చిత్రంను దర్శకుడు తెరకెక్కించాడు.
ఇక ఈ చిత్రంలో అనుష్క శర్మ లుక్ పై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. పల్లెటూరు మహిళగా అనుష్క లుక్ చాలా సహజంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో అనుష్క ఎక్కువగా సైకిల్‌పై తిరిగిన సీన్స్ ఉంటాయట. అనుష్కకు సైకిల్ అనుభవం అస్సలు లేదట. సైకిల్ పై ఎక్కడం - సైకిల్ పై జర్నీ గురించి గతంలో ఏమాత్రం అనుభం లేకపోవడంతో మొదట ఇబ్బంది పడ్డట్లుగా చెప్పుకొచ్చింది.
వరుణ్ ధావన్ ఈ చిత్రం కోసం రోజుకు 10 గంటల పాటు సైకిల్ తొక్కి మరీ సినిమా కోసం రెడీ అయ్యాడట. సైకిల్ పై కీలకమైన సీన్స్ ఉన్నాయి కనుక 15 రోజుల పాటు తాను కష్టపడ్డానంటూ వరుణ్ అంటున్నాడు. ఇక సైకిల్ అనుభవంపై అనుష్క మాట్లాడుతూ.. నేను ఎప్పుడు సైకిల్ ను వాడలేదు - సైకిల్ ఎక్కలేదు. ఆ సన్నివేశాల కోసం ఎక్కువ సమయం సైకిల్ పై కూర్చోవడం చాలా ఇబ్బంది అయ్యింది. అయినా కూడా సైకిల్ అనుభవం చాలా బాగుంది అంటూ ‘సుయ్ దాగా’ చిత్ర ప్రమోషన్‌లో చెప్పుకొచ్చింది.