ఒక స్త్రీ తన భర్తతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాక కొంతమంది దుండగుల చేతిలో చిక్కుకుని వారి నుండి ఎలా ఎలా బయటపడింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం "ఎన్హెచ్ 10". అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నవదీప్ దర్శకులు.
ఇప్పటికే ఈ సినిమా అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను మెప్పించి మంచి వసూళ్లను సైతం రాబట్టుకుంది. ఇప్పుడీ చిత్రం ప్రతిష్టాత్మక బీజింగ్ చిత్రోత్సవాల్లో చోటు దక్కించుకుంది. ఈ కథపై నమ్మకంతో అనుష్క శర్మ నిర్మాతగా మారింది కూడా. మొత్తానికి ఈ అమ్మడు నమ్మకం వమ్ము కాలేదు. అయితే ఈ బీజింగ్ చిత్రోత్సవంలో సినిమా పోటీలో ఈ చిత్రానికి స్థానం లేదుట. ప్రత్యేక
ప్రదర్శనకు మాత్రమే ఎంపికైంది. ఈ నెల 16 నుండి 23 వరకు జరగనున్న చిత్రోత్సవాల్లో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. బాక్సాఫీ