నాన్న‌కు ప్రేమ‌తో అనుష్క విషెస్ ఇలా!

Update: 2023-04-20 18:35 GMT
కుటుంబ‌మంటే అనుష్క శెట్టి కి ఎంతో ఇష్టం. స‌మ‌యం దొరికితే అమ్మ‌-నాన్న‌ల‌తోనే స‌మ‌యాన్ని గ‌డుపు తుంది. స్నేహితులు..పార్టీలు...గెట్ టూ గెద‌ర్ వంటి వాటికి అనుష్క దూరం. బేసిక్ గా యోగా టీచ‌ర్ కావ‌డ‌డంతో మ‌రింత క్ర‌మ శిక్ష‌ణ‌తో మెలుగుతుంది. ప‌రిశ్ర‌మ‌కి రాక ముందు ఎలా ఉండేదో? ఇప్పుటికీ అలాగే న‌డుచుకుంటుంది. కాక‌పోతే ఇప్పుడు సెల‌బ్రిటీ హోదాలో నీరాజ‌నాలు అందుకుంటుంది.

ప్ర‌స్తుతం సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి ఎక్కువ‌గా బెంగుళూరులో అమ్మ‌-నాన్న‌ల‌తోనే ఉంటుంది. అప్పుడ ప్పుడు అవ‌స‌రం మేర హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్ల‌డం మిన‌హా మిగిలిన స‌మ‌య‌మంతా! కుటుంబానికే కేటాయిస్తుంది. తాజాగా తండ్రి విట్ట‌ల్ శెట్టి పుట్టిన రోజు సంద‌ర్భంగా  ప‌ప్ప‌పై త‌న ప్రేమ‌ని చాటుకుంది. దానికి సంబంధించిన ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. తండ్రిని ఆలింగ‌నం చేసుకుని శుభాకాంక్ష‌లు తెలిపింది. ఎడ‌మ‌వైపున అనుష్క త‌ల్లి భ‌ర్త‌కు ప్రేమ‌తోనూ శుభాకాంక్ష‌లుతెలిపిన‌ట్లు క‌నిపిస్తుంది.

భార్య‌..కుమార్తె ప్రేమ‌లో విట్ట‌ల్ శెట్టి ఎంతో సంతోషంగా క‌నిపిస్తున్నారు. తండ్రితో అనుష్క రిలేష‌న్ షిప్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. నాన్న అంటే ఎంతో ఇష్టం. నాన్న‌తో ఉన్న బెస్ట్ మూవ్ మెంట్స్ ని ఇప్ప‌టికే చాలాసార్లు పంచుకుంది. నాన్న తో  ఉంటే స‌మ‌య‌మే తెలియ‌ద‌ని... ఓ కొత్త ప్ర‌పంచ‌మే ఆయ‌న‌తో ఉంటుంద‌ని... ఎన్ని సంవ‌త్స‌రాలు గ‌డిచిపోతున్నా... ఎన్ని ఏళ్లు వ‌చ్చినా... నేను ఎప్ప‌టికీ నీ చిట్టిత‌ల్లినే అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ లు పెట్టిన సంద‌ర్భాలెన్నో.

అనుష్క కెరీర్ సంగ‌తి చూస్తే నిశ‌బ్ధం  త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కొన్ని ర‌కాల ప‌రాజ‌యాలు అమ్మ‌డిని డైల‌మాలోప‌డేస్తాయి. అప్ప‌టి నుంచి స్టోరీల ఎంపిక విష‌యంలో కేరింగ్ ఎక్కువైంది. ఇప్పుండ‌త‌గా  అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు. అయినా అనుష్క మాత్రం అలాంటి నెగిటివిటీని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.  

బీ పాజిటివ్ అంటూ ముందుకు సాగిపోతుంది.  ప్ర‌స్తుతం యూవీ క్రియేష‌న్స్ లో ఓ సినిమా చేస్తోంది. మ‌హేష్ బాబు.పి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తున్నారు. వ‌యోభేదాల నేప‌థ్యంలో ఫ‌న్నీ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందనున్నట్లు స‌మాచారం.

Similar News