తనకు తెలిసిన యోగా టెక్నిక్స్ ని ఉపయోగిస్తూ ఇన్నాళ్లూ శరీరాన్ని అదుపులో ఉంచుకుంటూ వచ్చింది అనుష్క. అయితే సైజ్ జీరో కోసమని ఆమె ఒక్కసారిగా 20 కిలోలు పెరగాల్సి వచ్చింది. యోగాతో మళ్లీ కరిగించుకుంటా కదా అని ఆమె ధైర్యంగానే బరువు పెరిగింది. కానీ ఆ బరువుని తగ్గించుకోవాలనేసరికి అసలు కష్టాలు మొదలైనట్టున్నాయి. కథానాయకుడు ఆర్య చెప్పిన సలహాలతో బరువు తగ్గిందని సైజ్ జీరో బృందం చెబుతున్నప్పటికీ అనుష్క మాత్రం చాలా ఇబ్బంది పడుతోందట. కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ బరువు పెరుగుతోందట. రుద్రమదేవి ప్రమోషన్స్ కోసం అనుష్క బయటికొచ్చినప్పుడు ఆ విషయం స్పష్టంగా కనిపించింది.
భారీకాయంతోనే కనిపిస్తోంది అనుష్క. సైజ్ జీరో షూటింగ్ పూర్తై చాలా కాలమైంది. ఇప్పటికే అనుష్క మునుపటిలాగా నాజూగ్గా తయారు కావాలి. కానీ పెరిగిన ఆ కొవ్వు ఆమెని ఎంతకీ వదిలిపెట్టడం లేదట. దీంతో సైజ్ జీరో ఎందుకు చేశాన్రా బాబోయ్ అని ఆమె మథనపడుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది చాలదన్నట్టుగా మరోపక్క జక్కన్న అనుష్కని తొందరపెడుతున్నాడట. బాహుబలి2 లో అనుష్కది కీలకమైన పాత్ర. అనుష్కతోనే షూటింగ్ మొదలుపెట్టాల్సి వుంటుందట. అందుకే వీలైనంత త్వరగా బరువు తగ్గించుకొని వచ్చేయమని జక్కన్న చెబుతుండటంతో ఎటూ పాలుపోని అనుష్క అమెరికా వెళ్లిపోయినట్టు తెలిసింది. అక్కడ లైపో చేయించుకొని తిరిగి వచ్చేస్తుందట. యోగా గురువు అయిన తననే బరువు ఇంతగా ఇబ్బంది పెడుతోందేంటి అని అనుష్క చికాకు పడిందట. ఇక సహజంగా బరువు తగ్గడం తనవల్ల కాదని తెలిశాక ఆమె అమెరికా ప్రయాణం కట్టినట్టు తెలిసింది. అక్కడ్నుంచి తిరిగి రాగానే బాహుబలి 2 కోసం సెట్స్ పైకి వెళ్లబోతోంది.