తెలుగు సినీ పరిశ్రమకు జేజమ్మ అనుష్క. లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే మొదట గుర్తొచ్చే పేరు ఎవరికైనా అనుష్కదే. అనుష్క బాహుబలి సినిమా నుంచి కాస్త తేడాగా కనిపిస్తోంది. సినిమాలో ఉన్న అనుష్క, బయట ఉన్న అనుష్క ఒకరేనా అనిపించేలా ఉంది. బాహుబలి సినిమాలో అనుష్క సన్నని నడుముతో మల్లె తీగలా కనిపించింది. అదే బయట వేడుకల్లో మాత్రం బొద్దుగా కనిపిస్తోంది. అలాగే భాగమతీ సినిమాలో కూడా సన్నగా మెరిసింది. అదే అమ్మాయి ఇటీవల భాగమతి సినిమా సక్సెస్ మీట్‌కు వచ్చినప్పుడు మాత్రం వామ్మో అనేలా అంత పెద్ద ముఖంతో, భారీ శరీరంతో కనిపించింది. ఆమెను చూసి వేడుకకు వచ్చిన ఫాన్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు.
జీరో సైజ్ అనే సినిమాలో ఏదో కొత్తదనానికి పోయి... కష్టాలను కోరి తెచ్చుకుంది అనుష్క. ఆ సినిమా కోసం చాలా లావైంది. లావెక్కడానికి కొన్ని నెలలే పట్టినా... తగ్గడానికి మాత్రం ఏళ్లు పడుతోంది. నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ తగ్గడం లేదు. అప్పట్లో ఈ ఎఫెక్ట్ బాహుబలి 2 మీద కూడా పడింది. ఏదో లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఆమెను స్ర్కీన్ పై సన్నగా కనిపించేలా చెక్కారు రాజమౌళి. అదే పనితనం భాగమతిలో కూడా కనిపించింది. అందుకే చంచల చాలా సన్నగా కనిపించింది. ఇంకా ఎన్నాళ్లు పాపం ఈ పాట్లు అనుష్కకు అని జాలి పడుతున్నారు సినీ జనాలు. కాని అనుష్క మాత్రం ఆ మధ్యన అడిగితే.. కొన్ని కారణాల వలన సన్నబడ్డానికి టైమ్ పడుతోంది అని సెలవిచ్చింది.