ఆమెకు రెమ్యూనరేషన్ తర్వాతే ఏదైనా..!

Update: 2022-08-21 02:30 GMT
నందమూరి బాలకృష్ణ సినిమా లో నటిస్తూనే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించేందుకు కమిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఉంది. సీనియర్ హీరోలతో పాటు స్టార్‌ హీరోలతో.. చిన్న హీరోలతో ఇలా అన్ని రకాల సినిమాలను.. అన్ని రకాల హీరోలతో చేసేందుకు ఎప్పుడు ముందు ఉండే హీరోయిన్స్‌ లో శృతి హాసన్ ఒకరు అనడంలో సందేహం లేదు.

పాత్ర గురించి... సినిమా గురించి పెద్దగా పట్టింపు లేకుండా వచ్చిన అవకాశం ను చేయడం మాత్రమే శృతి హాసన్‌ చూస్తుంది అనేది కొందరి ఆరోపణ. ఆ ఆరోపణ నిజమేనేమో అనిపిస్తుంది.

ఒక వైపు సలార్‌ వంటి భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సమయంలో కాస్త జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ అమ్మడు సీనియర్ హీరోలతో సినిమాలకు ఓకే చెప్పడం ఆశ్చర్యం ను కలిగించక మానదు.

ఈ అమ్మడు కేవలం పారితోషికం ను మాత్రమే చూస్తుందని.. ఇతర విషయాలు అస్సలు పట్టవు అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు. పాత్ర చిన్నదైనా.. ప్రాముఖ్యత లేకున్నా కూడా కోటి రూపాయల పారితోషికం ఇస్తే చేసేందుకు ఓకే చెబుతుంది అనేది కొందరి విమర్శ. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సినిమాలను చూసినప్పుడు.

హీరోయిన్ గా శృతి హాసన్ సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది. కాని ఆమె స్టార్ డమ్ మాత్రం పెద్దగా పెరగడం లేదు. నటిగా ఆమె గొప్పగా గుర్తింపు దక్కించుకున్న సినిమాలు కూడా తెలుగు లో ఏమీ లేవు అనేది కొందరి అభిప్రాయం. కేవలం సినిమాల సంఖ్య పెంచుకుంటూ పోతున్న శృతి హాసన్‌ సినిమా ల ఎంపిక విషయంలో ఆమె అభిమానులు చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సలార్‌ సినిమాకు గాను ఎక్కువ డేట్లు ఇస్తున్నందుకు గాను రెండున్నర కోట్ల పారితోషికం ను తీసుకుంటుందట. ఇతర సీనియర్ హీరోల సినిమాలకు మరియు ఇతర సినిమాలకు గాను కోటి నుండి కోటిన్నర పారితోషికం ను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పారితోషికం కాకుండా కథ మరియు హీరో దర్శకుడిని కూడా ఈ అమ్మడు కాస్త పట్టించుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:    

Similar News