ఎస్పీ బాలుకు ఎన్టీఆర్ పుర‌స్కారం

Update: 2017-04-04 13:57 GMT
తెలుగు చ‌ల‌న‌చిత్ర జాతీయ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మ మాజీ అధ్య‌క్షుడు ప్రముఖ నటుడు, ఎంపీ మురళీ మనోహర్‌, సినీ నటుడు బాలకృష్ణ వార్డుల జాబితాను ప్రకటించారు. సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు (2012)కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. 2012-13 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు ప్రకటించారు. కాగా, 2014 - 15 - 16 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నటుడు మురళీమోహన్‌ తెలిపారు. ఈ ఐదేళ్ల అవార్డుల‌ను ఒకేసారి ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

2012 ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు- ఎస్పీ బాలసుబ్రమణ్యం
2013 ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు – హేమమాలిని

2012 బీఎన్‌రెడ్డి పురస్కారం- సింగీతం శ్రీనివాస్‌
2013 బీఎన్‌రెడ్డి అవార్డు -కోదండ రామిరెడ్డి

2012 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు – దగ్గుబాటి సురేష్‌
2013 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు – దిల్‌ రాజు

2012 రఘుపతి వెంకయ్య అవార్డు – కోడి రామకృష్ణ
2013 రఘుపతి వెంకయ్య అవార్డు – వాణిశ్రీ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News