ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ తర్వాత చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ నెలాఖరులోగా ఈ సమస్య సర్దుమణుగుతుందని అనిపిస్తోంది. పేదలకు సినీ వినోదం అందుబాటులో ఉండాలని చెబుతూ గతేడాది ఏప్రిల్ లో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.35 లో కీలక సవరణలు చేయడానికి రెడీ అయ్యారు.
సినిమా నిర్మాతలకు నష్టం లేకుండా ప్రజలకు భారం కాకుండా అందరికీ న్యాయంగా ఉండేలా టికెట్ ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పెద్ద సినిమాలతో పాటుగా చిన్న చిత్రాలకు కూడా ఐదో షోకి అనుమతిస్తామని అన్నారు. హీరోహీరోయిన్ల దర్శకుల రెమ్యూనరేషన్స్ ని పక్కనపెట్టి పెద్ద బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా చూస్తామని.. వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేస్తామని ప్రకటించారు.
టికెట్ ధరలు పెంచడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలను పాన్ ఇండియా చిత్రాలను స్పెషల్ గా ట్రీట్ చేస్తామని చెప్పడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు. అయితే సీఎం జగన్ మాట్లాడిన వీడియో చూస్తే అందులో కీలక మెలిక ఉందనేది అర్థం అవుతుంది. ''హీరో హీరోయిన్ల దర్శకుల పారితోషికాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. రెమ్యునరేషన్స్ పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన పెద్ద సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి'' అని జగన్ అన్నారు.
హీరో హీరోయిన్ - డైరెక్టర్ పారితోషకాలు మినహాయించగా బడ్జెట్ రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఉన్న సినిమాలను ప్రత్యేకంగా చూస్తామని జగన్ చెప్పారు. తెలుగులో రాజమౌళి తెరకెక్కించే సినిమాలతో పాటుగా ఒకటీ రెండు పాన్ ఇండియా సినిమాలు మాత్రమే ఈ కోవకు చెందుతాయి. ప్రసుతం స్టార్ హీరోల సినిమాలన్నీ వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్నప్పటికీ.. అందులో సగానికిపైగా హీరో హీరోయిన్ - డైరెక్టర్ రెమ్యునరేషన్ ఉంటుంది.
కానీ ఇప్పుడు అవి మినహాయించి చూస్తే సినిమాలు వంద కోట్లు దాటడం కష్టం. అలాంటపుడు ఈ టికెట్ల ధరల పెంపు వెసులుబాటు వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. భారీ టెక్నాలజీ - ఇన్నోవేషన్ - అత్యధిక బడ్జెట్ సినిమాలు రావడానికి ఇలా స్పెషల్ గా ట్రీట్ చేయబోతున్నట్లు ఏపీ సర్కారు చెబుతోంది. కానీ పారితోషకాలు తీసేసి 100 కోట్లు దాటిన సినిమాలకే ఇది వర్తిస్తుందని అంటే మాత్రం ఇబ్బందే. జీవో వస్తే ఇందులో అసలు విషయం ఏంటనే దానిపై స్పష్టత వస్తుంది.