పెళ్లి కాని అమ్మాయిలకు మలైకా సలహా
కొడుకు అర్హాన్‌తో కలిసి రెస్టారెంట్‌ను ప్రారంభించిన మలైకా అరోరా.. మీడియా ఎదుట వివాహిత మహిళలు లేదా పెళ్లి చేసుకోబోతున్న మహిళలకు సలహాలిచ్చారు.
వివాహిత మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంపై మలైకా అరోరా అద్భుతమైన సలహా ఇచ్చారు. భర్తతో కలిసి మీరు ఉద్యోగాలు చేయడం బాగానే ఉంటుంది కానీ.. ఉన్నవన్నీ ఆయనకే దోచిపెట్టడం సరికాదని, తమకంటూ బ్యాంక్ ఖాతాలో కొంత నిల్వలు ఉంచుకోవాలని మలైకా సూచించింది. మీరు మీ మొత్తం గుర్తింపును వదులుకుని వేరొకరి గుర్తింపును పొందాలని దీని అర్థం కాదు. మీరు మరొకరి ఇంటిపేరును తీసుకుంటున్నారు.. ఇది సరియైనదేనా? కాబట్టి మీరు చేయగలిగినది కనీసం సొంత బ్యాంకు ఖాతాను కొనసాగించడం.. ఆలోచించండి.. అని మలైకా అన్నారు.
పెళ్లయినా సొంత గుర్తింపు అనేది అవసరమని మలైకా అభిప్రాయపడ్డారు. కొడుకు అర్హాన్‌తో కలిసి రెస్టారెంట్‌ను ప్రారంభించిన మలైకా అరోరా.. మీడియా ఎదుట వివాహిత మహిళలు లేదా పెళ్లి చేసుకోబోతున్న మహిళలకు సలహాలిచ్చారు. స్వీయ నిబంధనలతో జీవితాన్ని గడుపుతున్న మలైకా పెళ్లి తర్వాత కూడా తమ గుర్తింపును కొనసాగించాలని మహిళలకు సలహా ఇచ్చారు. ఆర్థికంగా మహిళలు బలంగా ఉండాలని సూచించారు. కేవలం పెళ్లయిన యువతులే కాదు పెళ్లి కావాల్సిన యువతులకు మలైకా సలహా ఇవ్వడం గమనార్హం.
కొన్ని నెలల క్రితం అర్జున్ కపూర్ తన సింగిల్ స్టేటస్‌ని ధృవీకరించినప్పటి నుండి మలైకా అరోరా ఒంటరి జీవితం గురించి ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది. అర్జున్ ప్రకటన తర్వాత మలైకా తన ఇన్‌స్టాలో క్రిప్టిక్ పోస్ట్‌లను షేర్ చేసింది. విడిపోయినప్పటికీ సెప్టెంబరులో మలైకా తండ్రి విషాదకరమైన మరణం సమయంలో అర్జున్ అండగా నిలిచాడు.