ప్రభాస్ నటించిన `సాహో` ఆగస్టు 30న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో టెన్షన్ రెట్టింపవుతోంది. 2019 మోస్ట్ అవైటెడ్ మూవీగా `సాహో`కి ఉన్న క్రేజు దృష్ట్యా టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగులు హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీ-తెలంగాణలోనూ సాహో టిక్కెట్ల కోసం అభిమానులు.. కామన్ ఆడియెన్ నుంచి భారీగా డిమాండ్ నెలకొంది. తొలిరోజు తొలి వీకెండ్ నాటికి ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం అంతే జోరుగా పూర్తవుతోంది.
అయితే జనాల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగానే టిక్కెట్టు ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన `సాహో` నిర్మాతలు ఇప్పుడు అదనపు షోల కోసం ప్రభుత్వ అధికారుల్ని అభ్యర్థించారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి కావాల్సిన అనుమతులు ప్రభుత్వం నుంచి ఉదారంగానే లభించాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఏపీలో అదనంగా మరో రెండు షోలకు అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది. తొలి వారం 1ఏఎం నుంచి 10 ఏఎం వరకూ అదనంగా రెండు షోలు వేసుకునేందుకు పర్మిషన్ లభించిందట. 30 ఆగస్టు నుంచి 5 సెప్టెంబర్ వరకూ రోజుకు ఆరు షోలు ప్రదర్శించనున్నారు. అంటే 24/7 షోలు ఒకదాని వెంట ఒకటిగా పడుతూనే ఉంటాయన్నమాట.
ఇప్పటికే టిక్కెట్టు ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయినా చాలా చోట్ల టిక్కెట్లు దొరక్క కిటకిట లాడే సన్నివేశం ఉందట. ఇక తెలంగాణలోనూ ఆన్ లైన్ టికెటింగ్ జోరు కొనసాగుతోంది. అయితే టిక్కెట్ల పెంపునకు అనుమతులు రాలేదింకా. పెయిడ్ ప్రివ్యూలు కానీ .. అదనపు షోలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.