'వకీల్ సాబ్' కు ఏపీ హైకోర్టులో చుక్కెదురు..!

Update: 2021-04-10 14:25 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ''వకీల్‌ సాబ్'' సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్ చేసింది. మొదటి రెండు రోజులు మాత్రమే టికెట్ ధరల పెంపుకు అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ఈ ఒక్క రోజు(శనివారం) మాత్రమే టికెట్ ధరల పెంపుకు అవకాశం ఉంటుందని డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. రేపు( ఆదివారం) అడ్వాన్స్ బుకింగ్స్ కాకుండా మిగతా టికెట్స్ అన్నీ ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే అమ్మాలని డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదంటూ 'వకీల్ సాబ్' సినిమా రిలీజుకు ముందు రోజు జీవో జారీ చేశారు. దీనిపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించారు. దీనిని విచారించిన సింగిల్ బెంచ్, ఏపీలో మూడు రోజుల వరకు సినిమా టికెట్స్ ధరలు పెంచుకోవచ్చంటూ ఉత్వర్తులు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జ్ తీర్పును సవరిస్తూ, 'వకీల్ సాబ్' మూవీ టికెట్ ధరలు రేపటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఉండాలని డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది.
Tags:    

Similar News