233 సినిమాలు 135 అవార్డులు

Update: 2019-01-06 14:30 GMT
ఏ.ఆర్.రెహ‌మాన్ .. ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అఖ్క‌ర్లేని పేరు ఇది. యువ‌త‌రం గుండెల్లో అత‌డు ఓ ఉప్పెన‌. ఒక ఉల్లాసం.. ఒక సంగీత ఝ‌రి. ఆ స్వ‌రాల‌కు ఉన్న‌ మ‌హ‌త్తు అలాంటిది. ద‌శాబ్ధాలుగా అత‌డికి అంద‌నిది లేనేలేదు. అత‌డు చేయ‌ని ప్ర‌యోగం లేదు. అందుకోని ఎత్తులు లేవు. శిఖ‌రాల్ని అధిరోహించాడు. సుస్వ‌రాల సామ్రాజ్యంలో ఎదురే లేనివాడిగా ఎవ‌రెస్ట్ అంత ఎత్తు ఎదిగాడు. రెండు ఆస్కార్ లు అందుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కూ 233 సినిమాలు చేస్తే, అందులో 135 అవార్డులు అందుకున్నాడు. ఎన్నో జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ లు, లెక్క‌లేన‌న్ని స‌న్మానాలు .. అంతూ ద‌రీ లేని క‌చేరీలు .. ఇలా అత‌డి జీవితం ఆద్యంతం సంచ‌ల‌నాలమ‌యం. సంగీతం అనే సాధ‌న‌తో ప్ర‌పంచాన్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. ఇక‌పోతే ఏ.ఆర్.రెహ‌మాన్ పై అభిమానుల్లో ఓ ర‌క‌మైన అసంతృప్తి ఉంది. అత‌డు అత్యంత వేగంగా ఎంతో ఉన్న‌త స్థాయికి ఎదిగేయ‌డంతో ఇటు త‌మిళ్, తెలుగు సినిమాల‌కు దూర‌మైపోయారు. ఇంట‌ర్నేష‌న‌ల్ లైవ్ కాన్సెర్టులు, హాలీవుడ్- బాలీవుడ్ సినిమాలు అంటూ అత‌డు దూర‌మ‌వ్వ‌డంతో సౌత్ లో అత‌డి సంగీతం కొద‌వైపోయింద‌న‌డంలో సందేహం లేదు. ఇటీవ‌ల 2.0 స‌హా ప‌లు త‌మిళ చిత్రాల‌కు సంగీతం అందించారు. రీరికార్డింగ్ మాంత్రికుడిగా అత‌డు మ‌రో లెవ‌ల్లో త‌న స్థానాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు.

రెహ‌మాన్ పై బ‌యో(డాక్యూ) సిరీస్ తీస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. అయితే ఈ బ‌యో డాక్యు సిరీస్ ఇంకా లైవ్ లోకి రాలేదు. ప్ర‌ఖ్యాత అమెజాన్ ప్రైమ్ ఆ మేర‌కు ఇప్ప‌టికే రెహ‌మాన్ పై డాక్యు- సిరీస్ తీసేందుకు ఒప్పందాలు చేసుకుంద‌ని, ఐదు భాగాలుగా ఈ డాక్యు సిరీస్‌ ని తెర‌కెక్కించి లైవ్ చేస్తార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిపై స‌రైన క్లారిటీ లేదు. ఇక నేడు సంగీత మాంత్రికుని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు మాష‌ప్ సాంగ్స్ తో అద‌ర‌గొట్టారు. ప్ర‌ఖ్యాత లైకా సంస్థ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సెల‌బ్రిటీలు, అభిమానులు రెహమాన్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. అభిమానుల కోస‌మైనా, మునుముందు మ‌రింత విస్త్ర‌తంగా సౌత్ సినిమాల‌కు రెహ‌మాన్ ప‌ని చేస్తారేమో చూడాల్సి ఉంది.





Full View

Tags:    

Similar News