సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ -ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ లో 2.ఓ (రోబో2) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జోరుగా సాగుతున్నాయి. వీఎఫ్ ఎక్స్ - కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం తలమునకలుగా శంకర్ బృందం శ్రమిస్తోంది. కొన్ని తప్పిదాలు ఈ టీమ్ ని ఇబ్బంది పెట్టినా రాజీ లేని తత్వంతో శంకర్ మరోసారి గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రిలీజ్ తేదీ వాయిదాలపైనా ఆసక్తికర చర్చ సాగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన శంకర్ ఎట్టకేలకు నవంబర్ 29న ఈ సినిమాని ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు కాస్తంత ఊరట చెందినా రిలీజ్ అంతకంతకు వాయిదా పడుతుండడంతో ఇంకా ఇంకా అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.
సరిగ్గా ఇలాంటి వేళ అభిమానుల్లో ఉన్న కొన్ని సందేహాల్ని నివృత్తి చేసేందుకు ఏకంగా స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఓ టీవీ చానెల్ లైవ్ కెక్కారు. అక్కడ 2.ఓ గురించి, శంకర్ - రజనీ - అక్షయ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాల్ని ఆయన ముచ్చటించారు. ఈ సినిమాలో ఓ పాటను సీజీ లేకుండా అద్భుతంగా తరకెక్కించారని ఆయన అన్నారు. ఆ పాట మైండ్ బ్లోవింగ్ అంటూ పొగిడేశారు. అంతేకాదు శంకర్ లాంటి దర్శకుడు మనకు ఉండడం బ్లెస్సింగ్ అని తన దర్శకుడిని ఆకాశానికెత్తేశారు. 2.ఓ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ - కిలాడీ అక్షయ్ ని తెరపై చూస్తున్నంత సేపూ మనసు దోచేస్తారు.. అంటూ ప్రశంసించారు.
వాస్తవానికి రెహమాన్ అంతటివాడు ఒకరికి కాంప్లిమెంట్ ఇచ్చారంటే అది ఆషామాషీ కానేకాదు. అసలు సినిమా కంటెంట్ లో - సీన్స్ లో మ్యాటర్ లేకపోతే సంగీతం ఇచ్చేందుకు ఆయన ముందుకు రారన్న సంగతి తెలిసిందే. అలాంటిది శంకర్ తొలి చిత్రం `జెంటిల్ మేన్` నుంచి ఆయనతో కలిసి పని చేశారు రెహమాన్. ఇన్నేళ్ల జర్నీలో ఇద్దరి నుంచి పలు బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ప్రస్తుతం 2.ఓ సంగీతం - ఆర్.ఆర్‌ని ఫెంటాస్లిక్ గా కంపోజ్ చేస్తున్నారన్న సమాచారం ఉంది. ఇక ఈ ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 2.ఓ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఆ టీజర్ తర్వాత 2.ఓ సౌండింగ్ వేరేగా ఉంటుందన్న అంచనాలు ఏర్పాడ్డాయి. జస్ట్ వెయిట్.. ఫర్ 2.ఓ తాజా అప్‌డేట్స్ .. కీప్ వాచ్ దిస్ స్పేర్..