యంగ్ యమ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేశారు. ఆ మేరకు వసూళ్ల లెక్కలు తాజాగా రివీలయ్యాయి. ఎన్టీఆర్ - పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించిన `అరవింద సమేత: వీర రాఘవ` మొదటి రోజు ఏకంగా 27కోట్ల షేర్ వసూళ్లు సాధించి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు నెలకొల్పింది.
ఏరియావైజ్ లెక్కల్ని తాజాగా ట్రేడ్ వెల్లడించింది. నైజాం- 5.73కోట్లు - సీడెడ్ -5.48 కోట్లు - నెల్లూరు -1.06 కోట్లు - గుంటూరు-4.14కోట్లు - కృష్ణ- 1.97కోట్లు - తూర్పుగోదావరి - 2.77కోట్లు - పశ్చిమగోదావరి -2.37కోట్లు - ఉత్తరాంధ్ర -3.12 కోట్లు వసూలైందని తెలుస్తోంది. ఏపీ - తెలంగాణ మొత్తంగా 26.64కోట్ల షేర్ వసూలైందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రీమియర్ షోలతో అమెరికా నుంచి మరో 5.80 కోట్లు వసూలు చేసిందని రిపోర్ట్ అందింది. అంటే ఓవరాల్ లెక్క పరిశీలిస్తే 33కోట్ల వరకూ మొదటిరోజు వసూలైంది.
బాహుబలి-2 మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్ వసూలు చేసింది. అజ్ఞతవాసి -27 కోట్ల షేర్ వసూళ్లతో నాన్ బాహుబలి ఓపెనింగ్ రికార్డుల్లో అదరగొట్టింది. `రంగస్థలం` ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 46కోట్లు వసూలు చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో 20కోట్ల మేర వసూలు చేసింది. అయితే ఎన్టీఆర్ నటించిన `అరవింద సమేత- వీర రాఘవ` తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 27కోట్ల మేర ఓపెనింగ్ డే షేర్ వసూలు చేయడం హాట్ టాపిక్.