బాక్స్ ఆఫీస్ విజయానికి కొలమానం వసూళ్లే కానీ వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. కలెక్షన్లు ఇచ్చేదీ ప్రేక్షకులే కాబట్టి అధిక శాతం నచ్చితే వద్దన్నా కనక వర్షం కురిపిస్తారు. దేశీయంగా కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ అరవింద సమేత వీర రాఘవ పరిస్థితి ఓవర్సీస్ లో మాత్రం కొంత తేడాగానే ఉంది. ప్రీమియర్లతో అదరగొట్టి మిలియన్ మార్కు వైపు వేగంగా పరిగెత్తిన ఈ మూవీకి తర్వాత పరుగు మాత్రమె అంత సులభంగా ఉండటం లేదు.
మొదటి వారాంతానికి $1.65 మిలియన్లు రాబట్టిన అరవింద రాఘవులు ఆ తర్వాత 2 మిలియన్ మార్క్ చేరుకోవడానికి మాత్రం కాస్త టైం పట్టింది. నిన్నటితో ఆ క్లబ్ లోకి ఎంటరైనా ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు $2.5 మిలియన్ మార్కు దాటాలి. కానీ నెమ్మదించిన వసూళ్లు దానికి గ్యారెంటీ ఇచ్చేలా లేవు. ఇప్పటిదాకా యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తారక్ సినిమాల్లో నాన్నకు ప్రేమతో $2.02 మిలియన్లతో టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు దాన్ని దాటితే చాలు అనేలా ఉంది పరిస్థితి. బయ్యర్లు సేఫ్ కావాలి అంటే మాత్రం ఇంకో అర మిలియన్ రావాలి. అదంతా ఈజీ కాదు.
ఫ్యాక్షన్ నేపధ్యం కావడంతో పాటు రిపీట్ వేల్యూ లేదని అక్కడి ప్రేక్షకులు అభిప్రాయపడటంతో దాని ప్రభావం నేరుగా కలెక్షన్ మీద పడుతోంది. రెండున్నర మిలియన్లు దాటితేనె నష్టం లేకుండా ఉంటుంది. కానీ అదే కష్టంగా అనిపించిన తరుణంలో నష్టం వస్తే మాత్రం అక్కడి ట్రేడ్ భాషలో ప్లాప్ గానే పరిగణిస్తారు. ఈ లెక్కన అరవింద సమేత వీర రాఘవ ఇంటి గెలిచినా రచ్చ గెలవడం కష్టంగానే ఉంది.