దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టాయి. నైజాం - ఆంధ్రా రైట్స్ దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా దాదాపుగా ఒడ్డున పడ్డట్లుగానే సమాచారం అందుతుంది. కాని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మాత్రం స్వల్ప నష్టాలను చవిచూడాల్సి వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో మూవీ అనగానే అంచనాలు పీక్స్ కు చేరాయి. దాంతో అమెరికా రైట్స్ ను భారీ మొత్తంకు కొనుగోలు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లోకి వెళ్లాలి అంటే 2.5 మిలియన్ డాలర్లను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం సునాయాసంగా 2.45 మిలియన్ డాలర్లను సాధించింది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల కాంబో మూవీ కనీసం మూడు మిలియన్ ల డాలర్లను అయినా వసూళ్లు చేస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా 2 మిలియన్ డాలర్ల వసూళ్ల వద్ద ఈ చిత్రం నిలిచింది. డిస్ట్రిబ్యూటర్ కు నష్టం తప్పదని భావిస్తున్న ఈ సమయంలో ఒక మంచి పరిణామం ఏంటీ అంటే ఈ చిత్రం అమెరికా బాక్సాఫీస్ టాలీవుడ్ టాప్ 10 చిత్రాల సరసన నిలిచింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద రెండు మిలియన్ లకు పైగా వసూళ్లు సాధించిన 10వ చిత్రంగా ఈ చిత్రం నిలిచింది.
యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ అవ్వడం వల్ల ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లను రాబట్టలేక పోయిందనే టాక్ వినిపిస్తుంది. ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలెక్షన్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అరవింద అమెరికాలో టాప్ 5లో చేరబోతుందని భావించారు. కాని అనూహ్యంగా ఆ తర్వాత మెల్ల మెల్లగా జోరు తగ్గింది. ఎన్టీఆర్ అమెరికాలో ఇంకాస్త జోరు చూపించాల్సి ఉంది. అయినా కూడా నందమూరి ఫ్యాన్స్ నిరాశ చెందడం లేదు. టాప్ టెన్ లో చేరడంతో పాటు - తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ చిత్రం వసూళ్లను రాబట్టిందనే సంతోషంను వారు వ్యక్తం చేస్తున్నారు.