ప్చ్.. ఎన్టీఆర్ టార్గెట్ నాట్ రీచ్డ్!

Update: 2018-10-29 08:42 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' థియేట్రికల్ రన్ అమెరికాలో పూర్తయింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావడానికి 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించాల్సి ఉండగా 2.17 మిలియన్ డాలర్లు మాత్రమే సాధించింది.  చివరి వీకెండ్ లో 23 వేల డాలర్ల కలెక్షన్ నమోదు చేసిందని సమాచారం.

'అరవింద సమేత' ప్రిమియర్లు.. ఓపెనింగ్ వీకెండ్ లో భారీగా కలెక్షన్స్ నమోదు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపించింది గానీ ఆ తర్వాత మాత్రం డల్ అయింది.  ఇక అప్పటినుండి మళ్ళీ పెద్దగా కలెక్షన్స్ పికప్ కాలేదు.  త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ లోపించడమే దీనికి కారణం అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.   ఇదిలా ఉంటే ఈ సినిమా అమెరికాలో అల్ టైం హయ్యెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీస్ లిస్టు లో 10 వ స్థానంలో నిలవడం విశేషం.  

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లాస్ట్ మూడు సినిమాలు 2 మిలియన్ డాలర్ క్లబ్ లో అడుగుపెట్టినా అమెరికా డిస్ట్రిబ్యూటర్ కు లాభాలు అందించిన చిత్రం మాత్రం 'అ ఆ' మాత్రమే. ఇక 'అరవింద సమేత' విషయం లో డిస్ట్రిబ్యూటర్ కు ఒకే రిలీఫ్ ఏంటంటే నష్టాలు భారీగా లేవు.
Tags:    

Similar News