ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న `అరవింద సమేత` ఈనెల 11న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ మాస్ లోకి దూసుకుపోయింది. తారక్ లోని అన్ని రకాల ఎమోషన్స్ ని తెరనిండుగా ఆవిష్కరిస్తూ త్రివిక్రమ్ వండిన మాస్ మసాలా యాక్షన్ ఫ్యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఇదని అర్థమైంది. ఇందులో లవ్ కం ఫ్యామిలీ స్టోరి కొసరు. మొత్తానికి ట్రైలర్ తో పాజిటివ్ టాక్ వినిపించింది. మరో వారంలో రిజల్టే తేలనుంది.
ఇకపోతే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని లెక్కలొచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కుల రూపంలో 93 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేశారట. ఏరియా వైజ్ అమ్మకం లెక్కలు పరిశీలిస్తే నైజాం- 19.50 కోట్లు - సీడెడ్ - 15కోట్లు - అమెరికా -9.25కోట్లు - కృష్ణ - 5.50కోట్లు(అడ్వాన్ష్) - గుంటూరు -7.5కోట్లు - ప.గో జిల్లా- 4.90 కోట్లు - నెల్లూరు -3.30 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఏపీ-తెలంగాణ కలుపుకుని 71కోట్లు మేర బిజినెస్ సాగింది. కర్నాటక-తమిళనాడు-ఉత్తర భారతదేశం కలుపుకుని 9.50కోట్లు - ఓవర్సీస్ -12.50కోట్ల మేర బిజినెస్ పూర్తయింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కి 93 కోట్ల మేర బిజినెస్ సాగింది.
93 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అంటే ఆటోమెటిగ్గానే 100 కోట్ల షేర్ వసూళ్ల లక్ష్యం ఫిక్సయినట్టే. అంటే `అరవింద సమేత` దాదాపు 150కోట్ల మేర గ్రాస్ వసూలు చేస్తేనే అంత పెద్ద షేర్ వసూలైనట్టు. తారక్ కెరీర్ లో ఇప్పటివరకూ `జై లవకుశ` ది బెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది. అప్పటికి దాదాపు 80కోట్ల వసూళ్లతో అతిపెద్ద షేర్ వసూలు చేసిన టాప్-5 చిత్రంగా `జై లవకుశ` టాలీవుడ్ లో నిలిచింది. రామ్ చరణ్ `రంగస్థలం` - మహేష్ `భరత్ అనే నేను` చిత్రాలు 100కోట్ల షేర్ సినిమాలుగా రికార్డులకెక్కాయి. ఆ తర్వాత ఆ సినిమాలతో పోటీపడే సినిమాని ఇవ్వాలన్న పంతంతో తెరకెక్కించిన చిత్రమిది. తారక్- త్రివిక్రమ్-రాధాకృష్ణల పట్టుదల ఫలిస్తుందనే ఆశిద్దాం.