ఇటాలియన్‌ మోడల్‌ తో అర్హాన్‌!!

Update: 2018-09-04 01:30 GMT
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి గురించి గత రెండు దశాబ్దాలకు పైగా మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. కాని సల్మాన్‌ ఖాన్‌ మాత్రం పెళ్లిపై ఆసక్తి లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆయన తమ్ముడు అర్బాజ్‌ ఖాన్‌ మాత్రం వరుసగా పెళ్లిల్లు చేసుకుంటున్నాడు. బాలీవుడ్‌ లో నటుడిగా - నిర్మాతగా - దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న అర్బాజ్‌ ఖాన్‌ ఈమద్య ఒక ఇటాలియన్‌ మోడల్‌ తో చెట్టా పట్టాలేసుకుని తిరిగేస్తున్నాడు. ఈమెతో అర్బాజ్‌ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు అంటూ బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

1998లో నటి మలైకా అరోరాను వివాహం చేసుకున్న అర్బాజ్‌ ఖాన్‌ కొన్ని కారణాల వల్ల ఆమెకు 2016లో విడాకులు ఇచ్చాడు. ఇద్దరు విడిపోయిన తర్వాత కూడా కొడుకు అర్హాన్‌ కోసం స్నేహితులుగా ఉంటున్నారు. ఈ సమయంలోనే అర్బాజ్‌ ఖాన్‌ జార్జియా ఆండ్రియానీ అనే ఇటాలియన్‌ మోడల్‌ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరి వ్యవహారం తనయుడు అర్హాన్‌ కు కూడా తెలిసినట్లుంది. తనయుడు అర్హాన్‌ మరియు కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌ జార్జియాతో కలిసి ఈమద్య ఒక పార్టీలో అర్బాజ్‌ ఖాన్‌ పాల్గొన్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మలైకా అరోరాకు విడాకులు ఇచ్చిన సంవత్సరంలోనే అర్బాజ్‌ ఖాన్‌ కు జార్జియా ఆండ్రియాతో పరిచయం అయ్యిందని, త్వరలోనే వీరు వివాహం కూడా చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ కథనాలు వస్తున్నాయి. అర్బాజ్‌ ఖాన్‌ లైఫ్‌ లోకి కొత్తగా వచ్చిన జార్జియా ఎంత కాం ఆయనతో కొనసాగుతుందో అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News