ఆ డైరెక్టర్ పై కేసు వేస్తా: స్టార్ హీరో సోదరుడు

Update: 2020-06-17 13:31 GMT
బాలీవుడ్ లో మరో వివాదం మొదలైంది. డైరెక్టర్ అభినవ్ కశ్యప్ పై కోర్టులో కేసు వేస్తామని నటుడు, దర్శక నిర్మాత అర్భాజ్ ఖాన్ ప్రకటించారు. అర్భాజ్ ఖాన్ బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సోదరుడు. అంతేకాకుండా బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా పేరుంది.

తాజాగా అతడు తన తండ్రి సలీంఖాన్, సోదరులు సల్మాన్, సోహైల్ ఖాన్ మొత్తం కుటుంబమంతా అభినవ్ పై లీగల్ చర్య తీసుకుంటామని అర్బాజ్ ఖాన్ హెచ్చరించాడు.

తాజాగా సల్మాన్ ఖాన్ మొత్తం కుటుంబమంతా తనను వేధించిందని.. తన భార్యను రేప్ చేస్తామని బెదిరించారని.. 2013లో తన ‘భేషరమ్ ’ మూవీ విడుదలకు అడ్డుపడిదంటూ తాజాగా అభినవ్ కశ్యప్ సుధీర్ఘమైన పోస్టును సోషల్ మీడియాలో పెట్టి దుమారం రేపారు.

2010లో సల్మాన్, అర్భాజ్ నటించిన ‘దబాంగ్’ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించారు. దబాంగ్ 2 నుంచి అభినవ్ తప్పుకున్నారు. అప్పటి నుంచి తమకు కాంటాక్ట్ లో లేడని.. ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడో తెలియదని అర్భాజ్ ఖాన్ తెలిపారు.

నటుడు సుశాంత్ సూసైడ్ నేపథ్యంలో స్పందించిన దర్శకుడు అభినవ్ తాజాగా సల్మాన్ కుటుంబం కూడా తనను ఇలా వేధించిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సల్మాన్ తండ్రి సలీంఖాన్ కూడా ఖండించారు.
Tags:    

Similar News