గత కొంతకాలంగా మలైకా అరోరా ఖాన్ - ఆర్భాజ్ ఖాన్ వ్యవహారం ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎవరి దారి వారిది.. ఆయన దారి ఆయనదే.. ఆవిడ దారి ఆవిడదే అన్న చందంగా ఓపెన్ అవ్వడంతో ముంబై మీడియా టీఆర్ పీ గేమ్ ఆడుతోంది. ఆ ఇద్దరి ఎఫైర్‌కి సంబంధించిన ఫోటోలతో తామరతంపరగా నెటిజనుల్లో వేడి పెంచే కథనాల్ని ప్రచారం చేస్తున్నాయి మీడియాలు.
రంగుల ప్రపంచంలో ఎవరి లైఫ్ వారిది. హీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ విషయమై మలైకా వ్యవహరిస్తున్న తీరు ఇది. జీవితం ఎంతో విలువైనది.. అమూల్యమైనది.. వ్యక్తిగత వ్యవహారాల్ని ప్రశ్నించవద్దని మలైకా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇక అర్జున్ కపూర్ కి మీడియా నుంచి ప్రశ్నలు తప్పడం లేదు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఉన్నప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హీట్ పెంచుతున్నాయి.
మరోవైపు ఆర్భాజ్ ఖాన్ ఏమాత్రం తగ్గడం లేదు. తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ జార్జియా ఆండ్రియానీతో వేడుకలు - ఫంక్షన్లలో కనిపిస్తూ ఆర్బాజ్ వేడి పెంచుతున్నాడు. ఈ జంట శిల్పాశెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో ప్రత్యేకంగా హైలైట్ అయ్యారు. తాజాగా ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ నుంచి వస్తూ మీడియా కంట పడడంతో ఆ ఫోటోలు వెబ్ లో వేడి పెంచుతున్నాయి. మలైకా అధికారిక విడాకుల తర్వాత ప్రత్యేకించి తనపైనే దృష్టి సారించి మీడియా ఈ స్థాయిలో ఎందుకు వెంటపడుతోంది? సెలబ్రిటీలకు వ్యక్తిగత జీవితంపై ఇంతగా వెంటాడాలా? ప్రైవసీ అన్నదే ఉండదా? అంటూ యూత్ లో చర్చ సాగుతోంది. మీడియా అనవసర గందరగోళం సృష్టిస్తోందన్న విమర్శ ఎదురవుతోంది.