తెలుగు హీరోయిన్లను తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోరన్నది ఎప్పట్నుంచో ఉన్న ఆరోపణ. దశాబ్దాల చరిత్ర తీసి చూస్తే ఈ ఆరోపణ నిజమే అనిపిస్తుంది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ తెలుగు హీరోయిన్లకు మన దగ్గర రావాల్సినన్ని అవకాశాలు, పేరు రాలేదు. దీంతో స్వాతి.. అంజలి.. శ్రీదివ్య లాంటి వాళ్లు వేరే భాషలకు వెళ్లిపోయి మంచి అవకాశాలందుకున్నారు. మరో తెలుగమ్మాయి అర్చన సైతం తెలుగులో ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. తాను పెద్ద రేంజి హీరోయిన్ ఎందుకు కాలేదో తనకు ఎప్పుడూ అర్థం కాదని అంటోంది అర్చన. ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో భాగంగా ఆమె.. తన కెరీర్ ఊపందుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు అంటూనే ఆమె కొన్ని ఆరోపణలు చేసింది.
తాను తెలుగమ్మాయిని కాకపోయి ఉంటే తన కెరీర్ వేరే రకంగా ఉండేదేమో అని అర్చన అంది. తెలుగు వచ్చినప్పటికీ నొక్కి నొక్కి అదోరకంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. ఈ మాట తాను ఎవరినీ ఉద్దేశించి చెప్పట్లేదని అర్చన అంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో చేసిన పాత్ర తన ఇమేజ్ ను దెబ్బ తీసిందని అర్చన చెప్పింది. ఆ తర్వాత హీరోయిన్ పాత్రలు.. పూర్తి స్థాయి క్యారెక్టర్లు తనకు రాలేదని.. తనను ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులాగే ట్రీట్ చేయడం మొదలుపెట్టారని అర్చన అంది. ఈ సినిమాలు చెయ్యి.. ఆ సినిమా చేయొద్దు అని తనకు చెప్పే మేనేజర్ లేకపోవడం కూడా తన కెరీర్ ఊపందుకోవడానికి ఒక కారణమని ఆమె అంది. తన కెరీర్ ఆరంభంలో చేసిన ఒక సినిమాలో తాను అంతా బాగా చేసినా.. తన సీన్లు.. పాటలు తీసేయించారని.. ఇలా ఇండస్ట్రీలో చాలామంది రాజకీయాలకు బలయ్యారని ఆమె అంది.