ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం నిన్న థియేటర్లలోకి వచ్చింది.
RRR రిలీజ్ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి ఇవ్వడంతో.. అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించారు. అలానే ఉభయ రాష్ట్రాల్లో అదనపు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.
ఇలా ఏపీ - తెలంగాణ సపోర్ట్ తో ఓపెనింగ్ డే నాడు బాక్సాఫీస్ వద్ద RRR భారీ కలెక్షన్స్ అందుకోవడానికి అవకాశం కలిగింది. అయితే ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యతిరేకంగా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం జగన్ సర్కార్ వైఖరే అని తెలుస్తోంది.
ఇటీవల 'భీమ్లా నాయక్' సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించింది. స్పెషల్ షోలు వేసుకునే అవకాశం ఇవ్వలేదు. పవన్ సినిమాకు బెనిఫిట్ అవుతుందని టికెట్ ధరలు పెంపు జీవో కావాలనే ఆలస్యం చేశారని.. ప్రభుత్వం కక్ష పూరితంగా చేస్తోందని అభిమానులు ఆరోపించారు. ఏపీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వీటిని ఖండించారు.
కానీ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి ఏపీలో ఎలాంటి పరిమితులు లేవు. బెనిఫిట్ షోలు వేసుకోడానికి అనుమతి ఇవ్వడమే కాదు.. మొదటి పది రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. కౌంటర్ల వద్ద ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా ఉన్నారు.
'భీమ్లా నాయక్' సినిమా విషయంలో కఠినంగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వం.. శుక్రవారం రిలీజ్ అయిన RRR పై ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకపోలేదు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ వైఖరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్న గవర్నమెంట్.. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కోలా రూల్స్ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.