బిగ్ స్టార్స్ వ‌ల్ల‌ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారా?

Update: 2023-01-05 01:30 GMT
టాలీవుడ్ లో వున్న బిగ్ స్టార్స్ సినిమా వ‌చ్చేస్తోందంటే థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమా కు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావాల‌న్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్స్ సినిమా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని న‌మోదు చేయాల‌న్నా ఫ్యాన్స్ దే కీల‌క పాత్ర‌. స్టార్స్ కి గ‌త కొన్నేళ్లుగా ఫ్యాన్స్, యూత్ మ‌హారాజ పోష‌కులుగా మారుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి అలాంటి అభిమానే అలిగితే..అది స్టార్స్ వ‌ల్లే అయితే.. ఫ్యాన్స్ ఫీల‌వ‌రూ. ఇప్పుడు ముగ్గ‌రు స్టార్ హీరోల ఫ్యాన్స్ వారు చేస్తున్న ప‌నుల వ‌ల్ల తెగ ఫీలైపోతున్నార‌ట‌.

వివ‌రాల్లోకి వెళితే...అల్లు అర్జున్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీరి కార‌ణంగా తెగ ఫీల‌వుతున్నార‌ని తెలుస్తోంది. కార‌ణం ఈ ముగ్గ‌రు హీరోలు అనుస‌రిస్తున్న విధాన‌మేన‌ని చెబుతున్నారు. అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా ఉత్త‌రాదిలో హిందీ వెర్ష‌న్ వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి హాట్ టాపిక్ గా మారింది.

దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా రానున్న 'పుష్ప 2' ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం మొద‌లు పెట్టారు. సినిమా విడుద‌లై ఏడాది దాటినా ఇంత వ‌ర‌కు 'పుష్ప 2' స్పీడు పెంచ‌డం లేదు. ఐదు రోజుల షూటింగ్ త‌రువాత మ‌ళ్లీ బ్రేకిచ్చారు. సినిమా షూటింగ్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా బ‌న్నీ మాత్రం ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్ ల‌కు వెళుతూ కాల‌క్షేపం చేస్తున్నాడ‌ని, 'పుష్ప‌' సీక్వెల్ ని ప‌రుగులు పెట్టించ‌డం లేద‌ని ఫ్యాన్స్ తెగ ఫీల‌వుతున్నార‌ట‌.

ఇక మ‌హేష్ బాబు అభిమానులు కూడా ఇదే త‌ర‌హాలో ఫీల‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. 'స‌ర్కారు వారి పాట‌' త‌రువాత మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో SSMB28 ని చేస్తున్న ఇష‌యం తెలిసిందే. దాదాపు పుష్క కాలం త‌రువాత త్రివిక్ర‌మ్‌, మ‌హేష్ ముచ్చ‌టగా మూడ‌వ‌సారి క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ చాలా ప్ర‌త్యేకంగా చూస్తున్నారు. కానీ మ‌హేష్ మాత్రం ఫ్యామిలీతో వెకేష‌న్ ల‌కు వెళుతూ ప్రాజెక్ట్ విష‌యంలో దూకుడు చూపించ‌డం లేదు.

ఆ మ‌ధ్య యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఫ‌స్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. అయితే క‌థ‌లో భారీ మార్పులు చేయ‌డంతో ఆ యాక్ష‌న్ ఎపిసోడ్ ని డ‌స్ట్ బిన్ లో పడేసి ఫ్రెష్ గా షూటింగ్ చేయాల‌ని ప్లాన్ మొత్తం మార్చేశారు. ఇది కూడా ఇంత వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డంతో ఎప్ప‌టికి ప‌ట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఫీల‌వుతున్నార‌ట‌. ఇదిలా వుంటే జ‌న‌వ‌రి రెండ‌వ వారం నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని, ఏక‌ధాటిగా 60 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది.  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల ప‌రిస్థితి కూడా ఇలాగే వుంది. 'RRR'తో పాన్ ఇండిమా స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఈ మూవీ త‌రువాత కొర‌టాల శివ‌తో త‌న 30వ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. ఎప్పుడు మొద‌ల‌వుతుందో తెలియ‌దు. ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్ కి వెళ్ల‌డం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఇంత‌కీ ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కేనా? అని ఫీల‌వుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో తాజాగా తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన కొర‌టాల శివ ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఫిబ్ర‌వ‌రి నుంచి మొద‌లు పెడుతున్నామ‌ని క్లారిటీ ఇవ్వ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.బిగ్ స్టార్స్ వ‌ల్ల‌ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారా?
Tags:    

Similar News