'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మహేష్ కి జోడీగా 'మహానటి' కీర్తి సురేష్ నటించనుంది. మే నెలలో అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ కరోనా లాక్ డౌన్ కారణంగా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే ఈ చిత్రాన్ని జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. అయితే ఇప్పుడు మాత్రం ఇండియాలో ఎక్కువ భాగం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇందుకోసం 'సర్కారు వారి పాట' సినిమా సెకాండ్ ఆఫ్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నారట. ఇండియాలో ఎక్కువ భాగం.. అమెరికాలో తక్కువ భాగం షూటింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ మరియు క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ మాసీ లుక్ లో కనిపించాడు. సందేశాత్మక అంశాలతో కూడిన ఎంటర్టైనర్ గా వస్తున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.