టాలీవుడ్.. కోలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నయనతార. గత కొంత కాలంగా నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. మొదట వారి ప్రేమను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. రోజులు గడిచినా కొద్ది వారి ప్రేమ బయటకు వచ్చేఇంది. ప్రేమ విషయాన్ని వారే స్వయంగా బయటకు చెప్పేశారు. నయనతార బిజీ హీరోయిన్ గా సూపర్ స్టార్ క్రేజ్ తో దూసుకు పోతున్న ఈ సమయంలో పెళ్లి వద్దనుకుని దాదాపుగా మూడు ఏళ్లుగా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు పెళ్లికి సిద్దం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో నయన్ మరియు విఘ్నేష్ శివన్ ల ఒక ఫొటో వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో నయన్ చేతికి రింగ్ ఉండటంతో అదే ఎంగేజ్ మెంట్ రింగ్ అంటూ ప్రచారం జరిగింది.
నయనతార.. విఘ్నేష్ ల వివాహంకు విదేశాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వీరు వివాహం చేసుకోబోతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కు నయన్ మరియు విఘ్నేష్ లు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే నయన్ మరియు విఘ్నేష్ శివన్ ల పెళ్లి వేదిక విషయమై వారి నుండే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోందో అనే ఆసక్తితో నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.