జ‌స్ట్ ఇన్‌: టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కీల‌క నిర్ణ‌యాలివేనా?

Update: 2022-07-18 08:21 GMT
టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నారా? పెరిగిన రెమ్యున‌రేష‌న్ లు, ఆర్టిస్ట్ ల అద‌న‌పు ఖ‌ర్చులు, హ‌ద్దులు దాటుతున్న బ‌డ్జెట్ లు, ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాని ప‌రిస్థితుల కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న కార‌ణంగా కొంత కాలంగా సినిమాల నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపేయ‌ల‌ని నిర్ణ‌యించుకున్నారంటూ ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి. దీనిపై ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ కి సంబందించిన ప్రొడ్యూస‌ర్ లు ప‌ర‌త్యేకంగా శ‌నివారం మీటింగ్ పెట్టుకున్నారు.

దీంతో టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ సినిమా షూటింగ్ ల‌తో సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌బోతున్నారు అంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. నిర్మాత‌లు దీనిపై ప‌లు లీకుల‌నికూడా వ‌ద‌ల‌డంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే సోమ‌వారం స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు శినివారం జ‌రిగిన మీటింగ్ పై, షూటింగ్ ల తాత్కాలిక నిపుద‌ల‌పై స్పందించారు. శ‌నివారం జ‌రిగిన మీటింగ్ ప్ర‌ధానంగా మూడు కీల‌క అంశాల‌పై చ‌ర్చించార‌ట‌. అందులో మొద‌టిది కంటెంట్‌.

కోవిడ్ టైమ్ లో ప్రేక్ష‌కుల మైండ్ సెట్ మారింది. ఆ స‌మ‌యంలో వివిధ ఓటీటీల్లో అంత‌ర్జాతీయ స్థాయి సినిమాలు చూశారు. చాలా వ‌ర‌కు ఎడ్యుకేట్ అయ్యారు. త‌మ‌ని తాము అప్ డేట్ చేసుకున్నారు. దాంతో ఇప్ప‌డు వాళ్ల‌ని మామూలు రెగ్యుల‌ర్ కంటెంట్ తో ఆక‌ట్టుకోవ‌డం క‌ష్టం అని అర్థ‌మైంది. అలాంటి క‌థ‌ల‌ని ప‌క్క‌న పెట్టి కొత్త క‌థ‌ల‌పై దృష్టి పెట్టాల‌ని నిర్ణయించుకున్నాం. ఈ కారణంగానే క‌రోనా టైమ్ లో నేను విన్న ప‌ది క‌థ‌ల‌ని ప‌క్క‌న పెట్టేశాను. అదీ కాకుండా అంతా ఓకే అనుకున్న షూటింగ్ కి వెళ్లాల‌ని ఫిక్స్ అయిన రెండు సినిమాల‌ని కూడా అర్థాంత‌రంగా ఆపేశాను కూడా.

కార‌ణం క‌రోనా టైమ్ లో చాలా ఖాలీ స‌మ‌యం ల‌భించ‌డంతో ఓ చాలా మంది ద‌ర్శ‌కులు త‌మ‌కు నచ్చిన కొన్ని క‌థ‌ల‌ని హీరోల‌కు చెప్పి ఒప్పించి డేట్స్ తీసుకున్నారు. ఇప్ప‌డు అవి ఔట్ డేటెడ్ స్టోరీస్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. దీనిపై కూడా మీటింగ్ లో చ‌ర్చించాం' అన్నారు. దీనితో పాటు ఓటీటీల విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింద‌న్నారు. థియేట‌ర్ల‌లో రిలీజైన ప్ర‌తీ సినిమా ఎనిమిది నుంచి ప‌ది వారాల త‌రువాతే ఓటీటీల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాం అని తెలిపారు.

అంతే కాకుండా ఓటీటీ రిలీజ్ కి థియేట‌ర్ రిలీజ్ కి వున్న తేడాని, అనుభూతిని కూడా వివ‌రించారు. ఓటీటీలో రిలీజ్ అంటే సినిమాకు పెద్ద‌గా కిక్ వుండ‌దు. డ‌బ్బు వ‌స్తుంది అంతే. సినిమా స్ట్రీమింగ్ త‌రువాత బాగుందంటే కాఫీ తాగుతూ లైట్ తీసుకుంటాం. కానీ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయితే ఆ క‌థే వ‌రుగా వుంటుంది. రోజంత‌గా సంద‌డి, కాల్స్‌, మెసేజ్ లు వుంటాయి... ఆ మ‌జానే వేరు అన్నారు.

ఇక మీటింగ్ లో ప్ర‌ధానంగా సినిమా టికెట్ రేట్ల‌కు సంబంధించి కూడా చ‌ర్చ జ‌రిగింద‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భారీగా డ‌బ్బు క‌ర్చు చేసి సినిమా థియేట‌ర్ల‌కు రావ‌డానికి స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని, రెండ , మూడు వారాల త‌రువాత ఓటీటీలో ఫ్రీగా చూడాల‌నే ఆలోచ‌న‌క వ‌చ్చేశార‌ని ఇది గ‌మ‌నించిన నేను 'ఎఫ్ 3'తో టికెట్ రేట్ల‌పై నిర్ణ‌యం తీసుకున్నామన్నారు.

ఈ నేప‌థ్యంలో 'థాంక్యూ' మూవీ టికెట్ ని రూ. 100 కే ఫిక్స్ చేశామ‌ని, మ‌ల్టీప్లెక్స్ లో ఇది రూ. 150గా వుంటుంద‌ని తెలిపారు. ఇలా మూడు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించామ‌ని, వీటితో పాటు మీటింగ్ లో మాట్లాడుకున్న‌వ‌న్నీ ఒక్కొక్క‌టిగా అమ‌లు చేయాల‌ని నిర్ణయించుకున్నామ‌ని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు దిల్ రాజు.
Tags:    

Similar News